విందు పేరుతో విద్యార్థిని ఇంటికి పిలిచి లెక్చరర్ల దురాఘతం.. హైదరాబాద్‌లో మరో దారుణం

Undressing will trigger rain of Rs 50 crore in cash
two lecturers harass girl student: గురువంటే దైవంతో సమానం. పిల్లలకు విద్యాబుద్దులు నేర్పి వారు సన్మార్గంలో వెళ్లేలా చూస్తారు. అందుకే గురువుని, ఉపాధ్యాయ వృత్తిని దైవంగా చూస్తారు. కానీ, కొందరు వ్యక్తులు ఆ వృత్తికే కళంకం తెస్తున్నారు. విద్యార్థులతో అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారు. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు.
హైదరాబాద్ లో మరో దారుణం జరిగింది. తమ దగ్గర చదువుకుంటున్న విద్యార్థినిపై కన్నేసిన లెక్చరర్లు విందు పేరుతో యువతిని ఇంటికి పిలిచి లైంగికంగా వేధించారు. ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి మాదాపూర్ పోలీసులు ఇద్దరు లెక్చరర్లపై కేసు నమోదు చేశారు.
అల్వాల్ ప్రాంతానికి చెందిన యువతి రాంనగర్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో చదువుతోంది. అదే కాలేజీలోనే మాదాపూర్‌లోని చంద్రనాయక్ తండాలో నివాసం ఉంటున్న కల్యాణ్ వర్మ వైఎస్ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నాడు. యువతిపై కన్నేసిన కల్యాణ్ వర్మ, మరో లెక్చరర్ రవీందర్‌తో కలిసి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
తన ఇంట్లో విందుకు రావాలని యువతిని ఆహ్వానించాడు కల్యాణ్ వర్మ. దీంతో జనవరి 29న ఆ యువతి తన సోదురుడితో కలిసి మాదాపూర్‌లోని కల్యాణ్ వర్మ ఇంటికి వెళ్లింది. యువతి సోదరుడిని బయటే ఉండాలని చెప్పిన కల్యాణ్ వర్మ.. ఆమెతో కాసేపు మాట్లాడాడు. తర్వాత అక్కడే ఉన్న రవీందర్‌తో కలిసి యువతితో అనుచితంగా ప్రవర్తించాడు. ఆమెను లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. వారి ప్రవర్తనతో భయపడిపోయిన ఆ యువతి వారి నుంచి తప్పించుకుని పారిపోయింది.
ఫిబ్రవరి 9న మాదాపూర్ పోలీసులను ఆశ్రయించింది. జరిగిన విషయం చెప్పింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం తన దృష్టికి రాగానే ఆ ఇద్దరినీ ఉద్యోగం నుంచి తొలగించానని యువతి చదువుతున్న కాలేజీ డైరెక్టర్ తెలిపారు.