Road Accident : ఖైరతాబాద్ వినాయకుడిని చూడటానికి వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

మృతులు బోడుప్పల్ ప్రాంతానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఇద్దరి మృతదేహాలు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.

Road Accident : ఖైరతాబాద్ వినాయకుడిని చూడటానికి వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

Hyderabad Road Accident

Updated On : September 21, 2023 / 12:03 PM IST

Road Accident Two Died : హైదరాబాద్ లో విషాదం నెలకొంది. ఖైరతాబాద్ వినాయకుడిని చూడటానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. యశ్వంత్, సాయి రామ్ అనే ఇద్దరు యువకులు బైక్ పై ఖైరతాబాద్ వినాయకుడిని చూడటానికి వెళ్తున్నారు.

అడిక్ మెట్ జామై ఉస్మానియా బ్రిడ్జ్ వద్ద డివైడర్ ను ఢీకొని బైక్ పై వెళ్తున్న యశ్వంత్, సాయి రామ్ మృతి చెందారు. మృతులు బోడుప్పల్ ప్రాంతానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఇద్దరి మృతదేహాలు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Road Accident: నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి