Adilabad : చలాన్లు కట్టలేక బైక్‌కు నిప్పు పెట్టాడు

ట్రాఫిక్ చలాన్లు కట్టలేక ఓ వ్యక్తి బైక్‌ను తగలబెట్టాడు. ఈ ఘటన ఆదిలాబాద్‌ జిల్లాలో జరిగింది. చలాన్ల పేరుతో ట్రాఫిక్‌ పోలీసులు వేధిస్తున్నారంటూ.. వాహనదారుడు ఆవేదన వ్యక్తం చేశారు.

Adilabad : చలాన్లు కట్టలేక బైక్‌కు నిప్పు పెట్టాడు

Fire

Updated On : November 28, 2021 / 10:17 AM IST

set fire to the bike : ట్రాఫిక్ చలాన్లు కట్టలేక ఓ వ్యక్తి బైక్‌ను తగలబెట్టాడు. ఈ ఘటన ఆదిలాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది. చలాన్ల పేరుతో ట్రాఫిక్‌ పోలీసులు వేధిస్తున్నారంటూ.. షేక్‌ మక్బుల్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. వారం క్రితమే వెయ్యి రూపాయలు చలాన్ కట్టినట్లు చెప్పారు.

నిన్న మరోసారి తనిఖీలు చేసిన అధికారులు..చలాన్లు పెండింగ్ లో ఉండటంతో డబ్బులు కట్టాలని సదరు వాహనదారుడిని అడిగారు. వారం కిందటే చలానా డబ్బులు కట్టానని..మళ్లీ డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలని ట్రాఫిక్ పోలీసులకు చెప్పాడు. కరోనాతో సంపాదనే లేదని.. ఈ సమయంలో వేలకు వేలు చలాన్లు వేస్తే ఎక్కడ నుంచి తెచ్చి కట్టాలంటూ వాపోయాడు.

All-Party Meeting : నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం

వరుస చలాన్లతో అసహనానికి గురైన వాహనదారుడు చలాన్ల డబ్బులు కట్టలేక ఏకంగా బైక్ కు నిప్పంటించాడు. దీంతో ట్రాఫిక్ పోలీసులు నీళ్లు తీసుకొచ్చి మంటలార్పారు. విధి నిర్వహణలో భాగంగానే జరిమానా విధిస్తున్నట్లు చెప్పారు.