Amit Shah: అమిత్‌ షా వస్తున్నారు.. 27న ఖమ్మంలో బహిరంగ సభ.. షెడ్యూల్ ఇలా..

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈనెల 27న తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఖమ్మంలో తలపెట్టిన బీజేపీ రైతు సభలో పాల్గొని అమిత్ షా ప్రసంగిస్తారు.

Amit Shah: అమిత్‌ షా వస్తున్నారు.. 27న ఖమ్మంలో బహిరంగ సభ.. షెడ్యూల్ ఇలా..

Amit Shah

Minister Amit Shah: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈనెల 27న తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఖమ్మంలో తలపెట్టిన బీజేపీ రైతు సభలో పాల్గొని అమిత్ షా ప్రసంగిస్తారు. గతంలో రెండు సార్లు అమిత్ షా పర్యటన ఖరారైనప్పటికీ అనివార్య కారణాల వల్ల రద్దయింది. తాజాగా, ఈనెల 27న అమిత్ షా ఖమ్మం రానున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అమిత్ షా పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు.. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు రెండూ ఒకటేనంటూ కాంగ్రెస్ విస్తృత ప్రచారం చేస్తుంది. ఈనేపథ్యంలో ఖమ్మం బహిరంగ సభ వేదికగా అమిత్ షా చేయబోయే ప్రసంగంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

Telangana Congress: గాంధీభవన్‌కు పోటెత్తుతున్న ఆశావహులు.. టికెట్లకోసం భారీగా దరఖాస్తులు.. 700 దాటిన అర్జీలు..

ఖమ్మం పర్యటనలో భాగంగా ఆదివారం (ఆగస్టు 27) ఉదయం 11గంటలకు ఢిల్లీ నుంచి అమిత్ షా ప్రత్యేక విమానంలో బయల్దేరుతారు. మధ్యాహ్నం 1.25 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి బీఎస్‌ఎఫ్ (బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్) హెలికాప్టర్‌లో 2.10గంటలకు భద్రాచలం హెలిప్యాడ్ కు చేరుకుంటారు. మధ్యాహ్నం 2.55 నుంచి 2.40 గంటల వరకు భద్రాచలం ఆలయంలో సీతారాములను దర్శించుకుంటారు. భద్రాచలంలో 2.55 గంటలకు హెలికాప్టర్ లో బయలుదేరి 3.30 గంటలకు ఖమ్మంలోని హెలిప్యాడ్ కు చేరుకుంటారు. 3.40 గంటలకు ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుంటారు. 3.45 నుంచి 4.35 గంటల వరకు బహిరంగ సభలో అమిత్ షా పాల్గొన్నారు.

Earthquake: మణుగూరులో భూ ప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు

సాయంత్రం 4.40 గంటల నుంచి 5.30 గంటల వరకు పార్టీ నాయకులతో ప్రత్యేకంగా సమావేశం అవుతారు. సాయంత్రం 5.45 గంటలకు ఖమ్మంలో హెలికాప్టర్ లో బయలుదేరి 6.20 గంటలకు విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానం ద్వారా ఢిల్లీ వెళ్తారు.