The Kerala Story : ద కేరళ స్టోరీ సినిమా చూసిన కేంద్రమంత్రి, ఆడబిడ్డలను కాపాడుకోవాలని పిలుపు
G Kishan Reddy : ఒక మతానికి సంబంధించిన వారిని కుట్రలు, కుతంత్రాలతో మత మార్పిడులు చేయిస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. లవ్ జిహాద్ పేరుతో మహిళలను మత మార్పిడులు చేయిస్తున్నారని చెప్పారు.

G Kishan Reddy(Photo : Twitter, Google)
Kishan Reddy-Kerala Story : దేశంలో కొందరు.. మతం పేరుతో కుట్రలు చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యంగా ఒక మతానికి సంబంధించిన వారిని కుట్రలు, కుతంత్రాలతో మత మార్పిడులు చేయిస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. మన ఆడబిడ్డలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారాయన.
హైదరాబాద్ నారాయణగూడలోని శాంతి థియేటర్ లో బీజేపీ నాయకులు, మహిళా కార్యకర్తలు, అభిమానులతో కలిసి “కేరళ స్టోరీ” చిత్రాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చూశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కేరళ స్టోరీపై ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తలు చూసి సినిమా చూడాలి అనుకున్నానని ఆయన చెప్పారు. పార్టీ కార్యకర్తల కోరిక మేరకు వారితో కలిసి సినిమా చూశానన్నారు.
కేరళ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా కేరళ స్టోరీ సినిమాలో చూపించినట్లుగా సంఘటనలు జరుగుతున్నాయని కిషన్ రెడ్డి చెప్పారు. వాస్తవ కథ ఆధారంగా సినిమాను తెరకెక్కించినట్లు దర్శక, నిర్మాతలు చెప్పారని కిషన్ రెడ్డి వెల్లడించారు. వాస్తవానికి అనుగుణంగా సినిమా తీసినట్లు దేశ ప్రజలు భావిస్తున్నారని ఆయన అన్నారు.
ఒక మతానికి సంబంధించిన వారిని కుట్రలు, కుతంత్రాలతో మత మార్పిడులు చేయిస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. దేశంలో కొంతమంది మతం పేరుతో కుట్రలు చేస్తున్నారని చెప్పారు. ఇలాంటి సంఘటనలను యావత్ సమాజం ఖండించాలని పిలుపునిచ్చారు. ఆడబిడ్డలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందన్నారు కిషన్ రెడ్డి. ఐసిస్ తీవ్రవాదులు ముస్లిం మహిళలను కూడా ఏ విధంగా హింసించారో చూశామన్నారు. లవ్ జిహాద్ పేరుతో మహిళలను మత మార్పిడులు చేయిస్తున్నారని చెప్పారు.
Also Read..The Kerala Story : ది కేరళ స్టోరీ.. మరో కశ్మీర్ ఫైల్స్ కానుందా?