Union Delete Ration Cards : రేషన్ కార్డుదారులకి అలర్ట్.. 1.40 లక్షల రేషన్ కార్డులు రద్దు.. మీ పేరు ఉందేమో చెక్ చేసుకొండి..
Union Delete Ration Cards : రేషన్ కార్డుదారులకి కేంద్రం కీలక అలర్ట్ జారీ చేసింది. 1.40 లక్షల కార్డులను తొలగించినట్లు ప్రకటించింది.
union minister jayantibhai bambhaniya announces 1 40 lakh bogus ration cards cancelled in telangana 102 in ap
- పార్లమెంటులో కేంద్రం కీలక ప్రకటన
- దేశవ్యాప్తంగా 41.41 లక్షల రేషన్ కార్డుల తొలగింపు
- తెలంగాణలో 1.40 లక్షలు, ఏపీలో 102 రేషన్ కార్డుల తొలగింపు
Union Delete Ration Cards : తెలంగాణలో రేషన్ కార్డుదారులకు కీలక అప్డేట్ వచ్చేసింది. రాష్ట్రంలో 1.40 లక్షల రేషన్ కార్డులను తొలగించారు. ఈ విషయాన్ని స్వయంగా పార్లమెంటు వేదికగా ప్రకటించారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అక్రమంగా ఉన్న రేషన్ కార్డులను తొలగించినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి నిముబెన్ జయంతిభాయ్ బాంభానియా ప్రకటించారు. రేషన్ సరుకుల పంపిణీని పారదర్శకంగా చేయడమే కాక సులభతరం చేయడం కోసం.. దేశవ్యాప్తంగా ఉన్న 5.51 లక్షల రేషన్ దుకాణాల్లో లబ్ధిదారుల ఆధార్ బయోమెట్రిక్ ధ్రువీకరణ తర్వాతే ఆహార ధాన్యాలు పంపిణీ చేసేందుకు గాను ఈ-పాస్ (ePOS) పరికరాలను అమర్చామని తెలిపారు. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలకు తావు లేకుండా పోయిందన్నారు.
అలాగే దేశవ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఉన్న 41.41 లక్షల కార్డులను తొలగించినట్లు జయంతిభాయ్ స్పష్టం చేశారు. అక్రమ రేషన్ కార్డుల అంశానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్లో అతి తక్కువగా 102 కార్డులు ఉండగా, అత్యధికంగా రాజస్థాన్లో 6 లక్షలకు పైగా అక్రమ రేషన్ కార్డులు ఉన్నాయని, వీటన్నింటినీ తొలగించినట్లు వెల్లడించారు.
తెలంగాణలో పెరిగిన రేషన్ కార్డుల సంఖ్య
తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంతో పోలిస్తే.. రేవంత్ సర్కార్ పాలనలో రేషన్ కార్డుల సంఖ్య పెరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 15 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయని వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణలో 17,348 రేషన్ దుకాణాలు ఉన్నాయని, వీటి ద్వారా ప్రతి నెలా 1.05 కోట్ల కార్డులకు రేషన్ పంపిణీ జరుగుతోందన్నారు.
మొత్తం కార్డుల వివరాలు:
- ఫుడ్ సెక్యూరిటీ కార్డులు: 99,36,073
- అంత్యోదయ అన్న యోజన కార్డులు: 5,66,660
- అన్నపూర్ణ కార్డులు: 5,146
తెలంగాణలో 1.40 లక్షల అక్రమ రేషన్ కార్డులు ఉన్నాయని, వీటన్నింటినీ రద్దు చేసినట్లు జయంతిభాయ్ ప్రకటించారు. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలోని మొత్తం రేషన్ కార్డుల్లో అత్యధిక కార్డులు గ్రేటర్ మూడు జిల్లాల్లోనే ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
జిల్లాల వారీగా వివరాలు:
- హైదరాబాద్: 936 రేషన్ దుకాణాలు ఉండగా, కార్డుల సంఖ్య 8.39 లక్షలుగా ఉంది.
- రంగారెడ్డి: 588 షాపులు ఉండగా 6.53 లక్షల కార్డులు ఉన్నాయి.
- మేడ్చల్ మల్కాజిగిరి: 655 రేషన్ దుకాణాలు ఉండగా 6.41 లక్షల కార్డులు ఉన్నాయి.
- ములుగు జిల్లా: 1.02 లక్షలతో అత్యంత తక్కువ కార్డులు ఉన్నాయి.
- నారాయణపేట జిల్లా: 1.69 లక్షల కార్డులు ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ తెలిపింది.
