V. Hanumantha Rao : రాహుల్ గాంధీని హైదరాబాద్ లో పోటీ చేయాలంటున్న అసదుద్దీన్ కేరళలో పోటీ చేస్తారా? : వి.హనుమంతరావు
అక్టోబర్ 10న షాదనగర్ బీసీ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. బీసీ సభకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ముఖ్య అతిథిగా విచేస్తున్నారని తెలిపారు.

V. Hanumantha Rao (1)
V. Hanumantha Rao – Asaduddin Owaisi : రాహుల్ గాంధీని హైదరాబాద్ లో పోటీ చేయాలని అసదుద్దీన్ రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. రాహుల్ ని హైదరాబాద్ లో పోటీ చేయాలంటున్న అసదుద్దీన్ కేరళలో పోటీ చేస్తారా సవాల్ చేశారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా వి.హనుమంతరావు మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసం రాహుల్ గాంధీ కృషి చేస్తున్నారని తెలిపారు. అక్టోబర్ 10న షాదనగర్ బీసీ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. బీసీ సభకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ముఖ్య అతిథిగా విచేస్తున్నారని తెలిపారు. బీసీ బహిరంగ సభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
బీసీ సబ్ ప్లాన్, కుల ఘనన, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు, రాజకీయ ప్రాధాన్యత తదితర అంశాలపై చర్చ జరుగుతుందన్నారు. బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని కోరారు. బీసీలు అండగా ఉంటేనే విజయం సాధిస్తామని చెప్పారు. బీసీలకు సంఖ్య పరంగా నిధుల కేటాయింపు జరగాలన్నారు.