V. Hanumantha Rao : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుపై కాంగ్రెస్ నేత వీహెచ్ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయం కోసం బీజేపీ ఏమైనా చేస్తుందన్నారు. అదానీ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే బీజేపీ ఈ డ్రామాను తెరపైకి తెచ్చిందని విమర్శించారు.

HANUMANTA RAO
V. Hanumantha Rao : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయం కోసం బీజేపీ ఏమైనా చేస్తుందన్నారు. అదానీ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే బీజేపీ ఈ డ్రామాను తెరపైకి తెచ్చిందని విమర్శించారు. ప్రతిపక్షాలపై ఈడీ, సీబీఐతో దాడులు చేయించడం బీజేపీకి అలవాటే అన్నారు. సోనియా, రాహుల్ గాంధీ, డీకే శివకుమార్ నే వేధించారని పేర్కొన్నారు. గతంలో సృజనా చౌదరి వంటి వారికి నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. బీజేపీలో చేరగానే సృజనా చౌదరిపై కేసు ఏమైందని ప్రశ్నించారు.
గతంలో కూడా కొంతమందిపై విచారణలు జరిగాయని.. అయితే టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన తర్వాత వారిపై విచారణలు ఆగాయని.. ఎప్పుడు ఏమవుతుందో తెలియదన్నారు. స్వతంత్ర సంస్థలన్నీ నరేంద్ర మోదీకి చేతుల్లోనే ఉన్నాయని ఆరోపించారు. ప్రతిపక్షాలను అణగదొక్కేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తుందన్నారు. అదానీ అంశంపై మాట్లాడకుండా కొత్త కొత్త విషయాలపై మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. అదానీ అంశంపై ఇప్పటివరకు పార్లమెంట్ లోగానీ, బయటగానీ జవాడు చెప్పలేదన్నారు.
V Hanumantha Rao: మోదీ పాలన నియంతను తలపిస్తోంది.. మీడియాపై దాడులు సరికాదు: వీహెచ్
జాయింట్ పార్లమెంట్ కమిటీ ఏర్పాటు చేయాలని అడిగినా ఏర్పాటు చేయడం లేదన్నారు. వాజ్ పాయి ఉన్నప్పుడు కక్ష సాధింపు చర్యలు లేవని.. నరేంద్ర మోదీ వచ్చాకే అందరినీ ముఖ్యంగా ప్రతిపక్షాల నేతలను అణగదొక్కాలని చూస్తున్నాడని విమర్శించారు. బీజేపీని ఓడించాలంటే, డిక్టేటర్ పరిపాలన పోవాలంటే అందరం కలిసి బీజేపీని ఓడిస్తేనే న్యాయం జరుగుతుందన్నారు.
మరోవైపు ఆర్ఆర్ఎస్ వాళ్లు భారత్ హిందూ దేశమని ప్రచారం చేస్తూ, ముస్లింలను రెచ్చ గొడుతున్నారని పేర్కొన్నారు. అన్ని పార్టీలు ఓకే తాటిపైకి రావాలన్నారు. బీజేపీ హఠావో.. దేశ్ కు బజావో అనే నినాదంతో ముందుకెళ్లాలని అన్నారు. మహిళా దినోత్సవం రోజు ఒక మహిళపై కామెంట్ చేయనని చెప్పారు. కేసు దర్యాప్తు పూర్తైన తర్వాత మాట్లాడుతానని పేర్కొన్నారు.