Rajya sabha: నేడు రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వద్దిరాజు రవిచంద్ర

టీఆర్‌ఎస్ నేత వద్దిరాజు రవిచంద్ర సోమవారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11గంటలకు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న...

Rajya sabha: నేడు రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వద్దిరాజు రవిచంద్ర

Ravi Chandra

Updated On : May 30, 2022 / 10:13 AM IST

Rajya sabha: టీఆర్‌ఎస్ నేత వద్దిరాజు రవిచంద్ర సోమవారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11గంటలకు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న బండ ప్రకాష్ రాజీనామాతో ఖాళీ అయిన సీటుకు సీఎం కేసీఆర్ వద్దిరాజు రవిచంద్రకు అవకాశం కల్పించారు. ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు పేర్లను సీఎం కేసీఆర్ పరిశీలించినప్పటికీ.. చివరికి వద్దిరాజు రవివైపు మొగ్గుచూపారు. పార్టీ నాయకులతో కలిసిమెలిసి ఉండటం, ప్రముఖ నేతలతో పరిచయాలు కలిగి ఉండటంతో రవిచంద్ర రాజ్యసభకు వెళ్లేందుకు అవకాశం దక్కిందనే చర్చ ఉంది.

Ravi Chandra (1)

వద్దిరాజు రవిచంద్ర ఆదివారం సాయంత్రానికే ఢిల్లీ చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీ వెళ్లిన ఆయనకు ఖమ్మం ఎంపీ, టీఆర్‌ఎస్ లోక్ సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు ఆతిథ్యమిచ్చారు. వద్దిరాజు రవిచంద్రతో పాటు మంత్రి సత్యవతి రాథోడ్, జిల్లాకు చెందిన నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఢిల్లీ చేరుకున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి 400 మంది ఖమ్మం జిల్లా వాసులను గాయత్రి రవి విమానాల్లో ఢిల్లీ తీసుకెళ్లినట్లు సమాచారం.