Komatireddy Venkat Reddy: వారితో చర్చించిన తరువాతే వీరేశంను కాంగ్రెస్‌లోకి తీసుకున్నాం

అభ్యుదయ భావాలు ఉన్న వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉందని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

Komatireddy Venkat Reddy: వారితో చర్చించిన తరువాతే వీరేశంను కాంగ్రెస్‌లోకి తీసుకున్నాం

Komatireddy Venkat Reddy and Vemula Veeresham

Updated On : October 1, 2023 / 2:41 PM IST

Congress Leader Komatireddy Venkat Reddy: నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆదివారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. వీరి భేటీ అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే ఒక్కొక్క సీటుఅవసరం అని అన్నారు. ఔటరింగ్ రోగ్ రోడ్డు, భూములను అమ్మి కేసీఆర్ పథకాలకు పైసలు ఇస్తున్నాడని కోమటిరెడ్డి ఆరోపించారు. దళిత బంధులో ఎమ్మెల్యేలు కమీషన్ తీసుకుంటున్నారని స్వయంగా సీఎం కేసీఆర్ అన్నాడని గుర్తు చేశాడు. టీఎస్పీఎస్సీ లో సిట్ ఆఫీసర్ గా ఉన్న ఏఆర్ శ్రీనివాస్ ను బదిలీ చేశారని, సీఎం కేసీఆర్ ఇష్టారీతిలో పాలన సాగిస్తుండని కోమటిరెడ్డి విమర్శించారు.

Read Also : V Hanumantha Rao: ప్రధాని మోదీపై వీహెచ్ ఫైర్.. చిత్తశుద్ది ఉంటే అక్కడి పరిస్థితిని చక్కదిద్దాలంటూ డిమాండ్

అభ్యుదయ భావాలు ఉన్న వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉందని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే చిరుముర్తి లింగయ్య గురించి మాట్లాడటం వెస్ట్ . నకిరేకల్‌లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలతో చర్చించిన తర్వాతనే వేముల వీరేశంను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నామని చెప్పారు. నకిరేకల్‌లో 50 వేల మెజార్టీతో వేముల వీరేశం గెలవబోతున్నాడని అన్నారు. అనంతరం వేముల వీరేశం మాట్లాడుతూ.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.  ఈ రోజు నుంచి కోమటిరెడ్డి డైరెక్షన్‌లోనే పనిచేస్తానని, నకిరేక‌ల్‌లో కాంగ్రెస్ గెలుపు‌కోసం స్థానికంగాఉన్న శ్రేణులను కలుపుకొని వెళ్తానని వీరేశం అన్నారు.