Vijaya Dairy: విజయ డెయిరీ కీలక నిర్ణయం.. పాల ధరల్లో మార్పులు..!

రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీ కీలక నిర్ణయం తీసుకుంది. గేదె పాల ధరను లీటర్ కు..

Vijaya Dairy: విజయ డెయిరీ కీలక నిర్ణయం.. పాల ధరల్లో మార్పులు..!

Vijaya Dairy

Updated On : March 23, 2025 / 11:17 AM IST

Dairy Farmers: రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీ కీలక నిర్ణయం తీసుకుంది. గేదె పాల ధరను లీటర్ కు రూ.4 వరకు పెంచేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు సమాచారం. అయితే, ఇదే సమయంలో ఆవు పాల ధరను తగ్గించాలని యోచిస్తోన్నట్లు తెలిసింది.

Also Read: ఈ కోతి చేష్టలకు పాపం కొంగలు ఏమయ్యాయో చూడండి..

విజయ డెయిరీ ప్రతీరోజూ 4.5లక్షల లీటర్ల పాలను సేకరిస్తోంది. అందులో 85శాతం మేరకు ఆవు పాలే ఉంటున్నాయి. ప్రైవేట్ డెయిరీ సంస్థలు ఆవు పాలు లీటర్ కు రూ.32 నుంచి రూ. 33 వరకు చెల్లించి సేకరిస్తున్నాయి. విజయ డెయిరీ మాత్రం రూ.42 ఇస్తోంది. గేదె పాలు లీటర్ కు రూ.48 చెల్లిస్తోంది. అయితే, ఆవుపాల సేకరణతో సంస్థకు ఆదాయం కంటే నష్టమే ఎక్కువ వస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆవు పాల ధరలను తగ్గించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Also Read: Government Scheme: గుడ్‌న్యూస్‌.. 3.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఆమోదం.. యాహూ.. ఫుల్‌ డీటెయిల్స్‌..

విజయ డెయిరీ సంస్థకు దాదాపు రూ. వెయ్యి కోట్ల టర్నోవర్ ఉంది. అయితే, ప్రతినెలా రూ. 13కోట్లపైగా నష్టాలు వస్తున్నట్లు సమాచారం. దీంతో పాడి రైతులకు నెలనెలా చెల్లించాల్సిన పాల బకాయిలు కూడా ఇవ్వలేని పరిస్థితిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే, ఇందుకు ప్రధాన కారణం.. ఆవు పాల సేకరణ ధర అధికంగా ఉండటమేనని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆవుల పాల ధరను తగ్గించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు సమాచారం.