MLC Kavitha On Women Reservation Bill
BRS MLC Kavitha : మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం మరోసారి ఎమ్మెల్సీ కవిత దీక్షకు దిగనున్నారు. ఈ సందర్భంగా ఆమె మహిళా రిజర్వేషన్ కు సంబంధించిన బిల్లు విషయంలో బీజేపీ, కాంగ్రెస్ లు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. దేశంలోని మహిళలందరూ చట్టసభల్లో రిజర్వేషన్లు కోరుకుంటున్నారని..మహిళల రిజర్వేషన్ల కోసం సాబా సాహెబ్ అంబేద్కర్ కోరుకున్నారని ఈ సందర్భంగా కవిత గుర్తు చేశారు. మహిళా బిల్లు విషయంలో బీజేపీ కావాలనే జాప్యం చేస్తోందని ఆరోపించారు. మహిళా బిల్లు కోసం ప్రతీ ఒక్క మహిళా పోరాడాలని ఈ సందర్భంగా కవిత పిలుపునిచ్చారు.మహిళా బిల్లు కోసం మరోసారి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపడతామని తెలిపారు.
ఈ ఆందోళనలో పాల్గొనాలని కోరుతు సోనియాగాంధీ, ప్రియాంకా గాంధీ, మంత్రి స్పృతీ ఇరానీలకు ఆహ్వానాలు అందజేస్తామని తెలిపారు. చిత్తశుద్ధి ఉంటే బీజేపీ పార్టీలో ఉండే మహిళలు కూడా ధర్నాలో పాల్గొనాలని పిలుపునిచ్చారు కవిత. వారికి చిత్తశుద్ది ఎంత ఉందో అనే విషయం తేలిపోతుందన్నారు. మోడీ ప్రభుత్వం మహిళా బిల్లును ఎందుకు ఆమోదించడం లేదని నిలదీశారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో అయిన మహిళా రిజర్వేషన్ బిల్లును సభలో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. మహిళా బిల్లు కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మరోసారి దీక్ష చేస్తామని ఆమె ప్రకటించారు. ఈ దీక్షకు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, స్మృతి ఇరానీ సహా మహిళా నేతలు అందర్నీ ఆహ్వానిస్తామని తెలిపారు.