Telangana Judge Suspend : మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసులో జడ్జి జయకుమార్‌ను సస్పెండ్ చేసిన సుప్రీంకోర్టు

తెలంగాణ ప్రజా ప్రతినిధుల కోర్టు జడ్జి జయకుమార్ ను సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులపై కేసులు నమోదు చేయాలని తీర్పు ఇచ్చిన తెలంగాణ ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి జయకుమార్ ను సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది.

Telangana Judge Suspend : మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసులో జడ్జి జయకుమార్‌ను సస్పెండ్ చేసిన సుప్రీంకోర్టు

Telangana Judge jayakumar Suspend

Updated On : August 23, 2023 / 4:28 PM IST

Telangana Judge jayakumar Suspend : తెలంగాణ ప్రజా ప్రతినిధుల కోర్టు జడ్జి జయకుమార్ ను సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులపై కేసులు నమోదు చేయాలని తీర్పు ఇచ్చిన తెలంగాణ ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి జయకుమార్ ను సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. రాజ్యంగబద్ద వ్యవస్థలపై కేసులు పెట్టాలని ఎలా ఆదేశిస్తారు? అంటూ ప్రశ్నిస్తు అసహనం వ్యక్తిచేస్తు సస్పెన్షన్ ను విధించింది.

కాగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు 10మంది అధికారులపై కేసులు నమోదు చేయాలంటూ తెలంగాణ ప్రజా ప్రతినిధుల కోర్టు జడ్జి జయకుమార్ తీర్పునిచ్చారు. ఈ తీర్పుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన సుప్రీంకోర్టు ఏకంగా జడ్జిపైనే సస్పెన్షన్ వేటు వేసింది. రాజ్యంగబద్ద వ్యవస్థలపై కేసులు పెట్టాలని ఎలా ఆదేశిస్తారు? అంటూ ప్రశ్నిస్తు అసహనం వ్యక్తిచేస్తు సస్పెన్షన్ ను విధించింది.

తమపైనా కేసులు నమోదుకు ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశించటంతో ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాజ్యాంగబద్దంగా ఏర్పడ్డ వ్యవస్థలపై ఎలా కేసులకు ఆదేశిస్తారని సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రాజ్యాంగ వ్యవస్థలపై కేసులు నమోదుకు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేసింది. అనంతరం జడ్జి జయకుమార్ ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Nampally Court : మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహా 10 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని.. ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశం

కాగా..2018 ఎన్నికల సమయంలో శ్రీనివాస్‌ గౌడ్ నామినేషన్ వేశారు. దానితో పాటు అఫిడవిట్ ను సమర్పించారు. వాటిని ఎన్నికల సంఘం వెబ్ సైట్ లోకి అప్ లోడ్ చేసింది. ఆ తర్వాత ఆ అఫిడవిట్ మారిపోయిందని, పాతది డిలీట్ చేసి కొత్తది అప్ లోడ్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఇలా ట్యాంపరింగ్ చేయడంపై మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన చలువగాలి రాఘవేంద్ర రాజు అనే వ్యక్తి హైదరాబాద్‌ నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు సదరు ఎన్నికల సంఘం అధికారులపై కేసులు నమోదు చేయాలని జడ్జి జయకుమార్ ఆదేశించారు.

కానీ పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో పిటీషనర్ మరోసారి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జడ్జి జయకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల అఫిడవిట్​ టాంపరింగ్​ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది.ఎఫ్​ఐఆర్​ వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. కేసు నమోదు చేయకపోతే కోర్టు ధిక్కరణ కేసు ఎదుర్కోవాల్సి వస్తుందని మహబూబ్ నగర్ పోలీసులకు జడ్జి హెచ్చరించారు. దీంతో ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది.దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. రాజ్యాంగబద్ద వ్యవస్థలపై కేసులు నమోదు చేయాలని ఎలా ఆదేశిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తు జడ్జి జయకుమార్ ను సస్పెండ్ చేసింది.

Madurai Bench : భార్య ప్రసవానికి సెలవు కావాలని ఎస్సై దరఖాస్తు, అంగీకరించిన అధికారులపై కోర్టు ఆగ్రహం