గణేశ మండపాలకు వాతావరణ, విద్యుత్ హెచ్చరికలు

తెలంగాణ వ్యాప్తంగా సోమవారం నుంచి కురువనున్న వర్షాలను దృష్టిలో ఉంచుకుని వినాయకచవితి మండపాలను ఏర్పాటు చేసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. సోమవారం నుంచి 3రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. బంగాళాఖాతం పశ్చిమ మధ్య ప్రాంతంలో 7.6కి.మీ ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ప్రభావంతో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశాలు భారీ ఉన్నాయని తెలిపారు. దీంతో పాటు మధ్యప్రదేశ్‌పై 3.6కిలోమీటర్ల ఎత్తున మరో ఉపరితల ఆవర్తనం ఉంది. ఫలితంగా తెలంగాణలో రుతుపవానలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ కేంద్ర అధికారి రాజారావు వెల్లడించారు.
మండపాలకు లైటింగ్‌లతో పాటు పలు విద్యుత్ సదుపాయాలు ఏర్పాటు చేస్తుంటారు. వాటి విషయంలో సేఫ్ కనెక్షన్లు వాడాలని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ అధికారులు సూచిస్తున్నారు. మండపాల వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసుకునే విద్యుత్ తీగల వల్ల అనేక ప్రమాదాలు జరిగే అస్కారముందని అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. పూర్తిగా నివాస ప్రాంతాల్లో ఏర్పాటు చేసే మండపాల్లో షార్ట్ సర్క్యూట్‌లు, విద్యుత్‌షాక్ తగిలితే ఆస్తి, ప్రాణనష్టం జరిగే అవకాశమున్నందున నిర్లక్ష్యంగా వ్యవహరించరాదంటున్నారు.
మండపాల విద్యుదీకరణ పనులు కేవలం లైసెన్స్‌డ్ ఎలక్ట్రిక్ కాంట్రాక్టర్ ద్వారా మాత్రమే చేపట్టాలి. మండపం దగ్గర 5 కేజీల కార్బన్‌డయాక్సైడ్ సిలిండర్లను అమర్చుకోవాలి. 2 బకెట్లలో ఇసుకను నింపి పెట్టుకోవడం మంచిది. ఎక్కువ కనెక్షన్లు తీసుకోవడానికి 3 పిన్ ప్లగ్గులు, సాకెట్లను మాత్రమే అమర్చుకోవాలి. లోహపు వస్తువులన్నింటికీ ఎర్తింగ్ సపోర్ట్ తీసుకోవాలి. తడి చేతులతో విద్యుత్ తీగలను, పరికరాలను తాకకూడదు. ఫిలమెంట్ బల్బులు ఎట్టి పరిస్థితుల్లోను వినియోగించకూడదు. అత్యధికంగా ఉష్ణాన్ని ఉత్పిత్తిచేసి అగ్నిప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి.