Mohammad Azharuddin: వీడని సస్పెన్స్.. ఆ మూడు కీలక శాఖల్లో అజారుద్దీన్‌కు ఇచ్చేది ఏది?
మంత్రి పదవి ఆశించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమించి క్యాబినెట్ హోదా కల్పించింది సర్కార్. అదే విధంగా
Mohammad Azharuddin: మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న అజారుద్దీన్ కు ఏ శాఖను కేటాయించబోతున్నారు? ఇప్పుడీ అంశం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. అసలు అజారుద్దీన్ మదిలో ఉన్న ఆయన కోరుకున్న డిపార్ట్ మెంట్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు ఏ శాఖ కేటాయిస్తారు? దీనిపై పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. తెలంగాణలో మూడోసారి మంత్రివర్గ విస్తరణ జరిగింది. కానీ ఈసారి ఒక్కరికే ఛాన్స్ దక్కింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మొదట సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో 11మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత 3 నెలల క్రితం మరో ముగ్గురిని క్యాబినెట్ లోకి తీసుకున్నారు సీఎం. వారిలో వాకిటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ ఉన్నారు. తాజాగా అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో తెలంగాణ క్యాబినెట్ లో మంత్రుల సంఖ్య 15కి చేరింది. మరో రెండు బెర్తులు ఖాళీగా ఉన్నాయి.
దీంతో పాటుగా మంత్రి పదవి ఆశించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమించి క్యాబినెట్ హోదా కల్పించింది సర్కార్. అదే విధంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ కు సివిల్ సప్లయ్స్ ఛైర్మన్ గా నామినేటెడ్ పోస్ట్ ను కేటాయించింది. తెలంగాణలో ఇంకా మంత్రి పదవులు ఆశిస్తున్న వారూ ఉన్నారు. వీరిలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డిలు ఉన్నారు. మరో ఒకరిద్దరు కూడా మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
తాజాగా మంత్రి పదవి దక్కించుకున్న అజారుద్దీన్ కు ఏ శాఖ కేటాయిస్తారు అనేది ఉత్కంఠగా మారింది. అజార్ కు హోంశాఖ కేటాయిస్తారని జోరుగా చర్చ నడుస్తోంది. గత ప్రభుత్వం మైనార్టీలకు హోంశాఖ కేటాయించిందని, కాంగ్రెస్ కూడా అదే పని చేస్తుందని ప్రచారం ఉంది. ప్రస్తుతం హోం, విద్య, మున్సిపల్ లాంటి కీలక శాఖలు సీఎం రేవంత్ దగ్గరే ఉన్నాయి. మరోవైపు అజార్ అంతర్జాతీయ క్రికెటర్ కావడం, గతంలో ఆయన టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించడంతో స్పోర్ట్స్ శాఖతో పాటు మైనార్టీ వెల్ఫేర్ శాఖలను ఆయనకు కేటాయించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం స్పోర్ట్స్ శాఖను మంత్రి శ్రీహరి నిర్వహిస్తున్నారు. మైనార్టీ వెల్ఫేర్ శాఖను మంత్రి అడ్లూరి చూస్తున్నారు. మొత్తంగా సీఎం దగ్గరున్న ఏదో ఒక శాఖను అజార్ కు కేటాయిస్తారా? లేక మంత్రులు శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ ల దగ్గరున్న ఒక్కో శాఖను తొలగించి అజార్ కు కేటాయిస్తారా అన్నది ఇంట్రస్టింగ్ మారింది.
Also Read: ఇద్దరు ఇన్? ముగ్గురు ఔట్? తెలంగాణ క్యాబినెట్‌లో ఆ రెండు పోస్టులను భర్తీ చేయబోతున్నారా..
