KTR: కొండా సురేఖ కామెంట్స్‌పై కేటీఆర్ మౌనం అందుకేనా?
లేడీ ఫైర్ బ్రాండ్‌గా పేరున్న కొండా సురేఖ తీవ్ర విమర్శల పాలవుతున్నారు. అందరికీ ఆమె టార్గెట్ అయిపోయారు.

ఆయనే టార్గెట్. తనను ట్రోల్ చేయించింది అతడేనని ఆమె కోపం. అందుకే కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ సమంత పేరు ప్రస్తావిస్తూ..నాగార్జున ఫ్యామిలీని వివాదంలోకి లాగారు మంత్రి కొండా సురేఖ. ఆవేశంతోనో..ఆగ్రహంతోనో..ఆమె టంగ్ స్లిప్ అయి చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. తెలుగు సినీ ఇండస్ట్రీ నటీనటులతో పాటు రాజకీయ నేతలు, వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు..అన్నింటికి మించి ప్రజలు, మహిళల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది.
ఏకంగా కాంగ్రెస్ అధిష్టానానికి కూడా ఫిర్యాదులు వెళ్లాయి. ఈ వివాదం ఎలా ఉన్నా కొండా సురేఖ అసలు టార్గెట్ మాత్రం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే. తనపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయిస్తున్నారనే ఆగ్రహంతో కేటీఆర్‌పై విమర్శలు చేసే క్రమంలో కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు కొండా సురేఖ. ఆమె వ్యాఖ్యలతో నాగార్జున కుటుంబం బాగా నొచ్చుకుంది. అందుకే పరువు నష్టం దావా కూడా ఫైల్ చేశారు నాగార్జున. కేటీఆర్ కూడా హర్ట్ అయినట్లు తెలుస్తోంది. కానీ ఆయన ఎక్కడా స్పందించడం లేదు. కొండా సురేఖ కామెంట్స్‌కు కౌంటర్ ఇవ్వడం కానీ.. ట్వీట్ చేయడం గానీ లేదు.
కొండా సురేఖ కామెంట్స్‌పై కేటీఆర్ రెస్పాండ్ కాకపోవడం బీఆర్ఎస్ పార్టీలోనే చర్చనీయాంశం అవుతోంది. మహిళా మంత్రి కామెంట్స్‌కు నిరసనగా గాంధీ భవన్ ముందు కేటీఆర్ ధర్నా చేస్తారని ప్రచారం జరిగింది. ఏమైందో తెలియదు కానీ ఎలాంటి నిరసన తెలపలేదు. ఆ తర్వాత బీఆర్ఎస్ నేతలు పెద్దఎత్తున ఆందోళనలకు సిద్ధం అవుతున్నట్లు కూడా పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. అదీ జరగలేదు. కేవలం కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపి సైలెంట్ అయిపోయారు కేటీఆర్.
ఇండైరెక్ట్ కామెంట్స్
రుణమాఫీపై పార్టీ ఆందోళన కార్యక్రమంలో ఇండైరెక్ట్ కామెంట్స్ చేశారు. మూసీ గబ్బంతా సీఎం రేవంత్, ఆయన మంత్రుల నోట్లోనే ఉందన్నారు. సీఎం, మంత్రిపై పరువునష్టం దావాతో పాటు క్రిమినల్ దావా వేస్తానన్నారు. కానీ ఎక్కడా మంత్రి కొండా సురేఖ పేరు ప్రస్తావించలేదు. గులాబీ పార్టీ నేతలు కూడా ఒకటి రెండ్రోజులు ప్రెస్‌మీట్లు పెట్టి..ఆ ఇష్యూను వదిలేశారు. అయితే కొండా సురేఖ ఇష్యూలో అటు కేటీఆర్, ఇటు బీఆర్ఎస్ నేతలు ఎందుకు పెద్దగా రియాక్ట్ కావడం లేదన్న దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
బీఆర్ఎస్ భవిష్యత్ నేతగా ఉన్న కేటీఆర్..తన క్యారెక్టర్ మీదే మచ్చ పడేలా కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేసినా ఎందుకు పెద్దగా స్పందించడం లేదన్న దానిపై ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంత పెద్ద ఇష్యూలో కేటీఆర్ సైలెంట్‌గా ఉంటే పార్టీ శ్రేణులతో పాటు జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని బీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారట. అయితే కేటీఆర్ మౌనం వెనుక అంతర్యం ఏంటన్నది మాత్రం ఎవరికీ అంతు చిక్కడం లేదు.
కొందరు బీఆర్ఎస్ నేతలు మాత్రం కేటీఆర్ కావాలనే సైలెంట్‌గా ఉంటున్నారని చెబుతున్నారు. ఆయన మౌనం వెనక వ్యూహం ఉందని అంటున్నారు. కొండా కామెంట్స్‌పై మాట్లాడితే తన స్థాయి తగ్గిపోతుందని కేటీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఓ మహిళపై కొండా సురేఖ చేసిన కామెంట్స్ ఇప్పటికే దుమారం లేపుతుండగా..తాను రెస్పాండ్ అయితే సున్నితమైన ఇష్యూ ఇంకా పెద్దగా అవుతుందన్న భావిస్తున్నారట కేటీఆర్. అందుకే మౌనంగా ఉంటున్నారన్న చర్చ జరుగుతోంది.
ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
అంతేకాదు కొండా కామెంట్స్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. లేడీ ఫైర్ బ్రాండ్‌గా పేరున్న కొండా సురేఖ తీవ్ర విమర్శల పాలవుతున్నారు. అందరికీ ఆమె టార్గెట్ అయిపోయారు. సోషల్ మీడియాలో ఆమెపై ఇంకా అటాక్ జరుగుతోంది. మహిళల నుంచి కూడా రియాక్షన్ బానే వచ్చింది. జనంలోనే కొండా మీద వ్యతిరేకత వ్యక్తం అవుతున్నప్పుడు తాను మాట్లాడి ఇష్యూను మరింత సాగదీయడం ఎందుకని సైలెంట్‌గా ఉంటున్నారట కేటీఆర్. మంచేదో చెడేదో జనాలే డిసైడ్ చేస్తారని..తాను మాట్లాడి మహిళను తిట్టారన్న పేరు తెచ్చుకోవడం ఎందుకని అనుకుంటున్నారట కేటీఆర్. సో సైలెంట్‌గా ఉండటమే సో బెటర్ అని ఆయన డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
విన్నవించారు.. మాట నెగ్గించుకున్నారు.. ఇప్పుడు కూటమిలో ఇష్యూకు పరిష్కారం