విన్నవించారు.. మాట నెగ్గించుకున్నారు.. ఇప్పుడు కూటమిలో ఇష్యూకు పరిష్కారం

ఇప్పుడు మరోసారి తమ మనోగతానికి అనుగుణంగా మున్సిపల్ కమిషనర్‌ను బదిలీ చేయించారని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

విన్నవించారు.. మాట నెగ్గించుకున్నారు.. ఇప్పుడు కూటమిలో ఇష్యూకు పరిష్కారం

Updated On : October 8, 2024 / 9:45 PM IST

ఆ సెగ్మెంట్‌లో టీడీపీ క్యాడర్‌ కూల్‌ అయిపోయింది. అనుకున్నాం పట్టుబట్టి సాధించామంటూ ఖుషీ అవుతోంది. మంత్రితో గొడవ లేదు..కూటమిలో పంచాయితీ లేదు..ఆ ఆఫీసర్‌ వద్దనుకున్నాం..అదే విషయాన్ని మంత్రికి చెప్పాం..తప్పించారు. నో క్లాషెస్‌ ఓన్లీ ఫ్రెండ్షిప్‌ అంటున్నారు టీడీపీ నేతలు, కార్యకర్తలు. మున్సిపల్‌ కమిషనర్‌ చుట్టూ తిరిగిన ధర్మవరం కూటమి పంచాయితీకి ఎండ్‌కార్డ్‌ వేసేట్లు చేశారు. మీడియాలో వచ్చిన వార్తలు..బయట జరిగిన ప్రచారం అంతా తూచ్‌ అన్నట్లుగా సీన్‌ను మార్చేశారు.

ధర్మవరం కూటమిలో మొన్నటి వరకు మున్సిపల్ కమిషనర్‌ నియామకం చిచ్చు రాజేసింది. బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచి కూటమి సర్కార్‌లో మంత్రి అయిన సత్యకుమార్‌ తమ మాట వినకుండా..తమకు గిట్టని ఆఫీసర్‌ను మున్సిపల్‌ కమిషనర్‌గా నియమించారని టీడీపీ క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఆగ్రహంతో రగిలిపోయిన టీడీపీ క్యాడర్‌
వైసీపీ హయాంలో పనిచేసిన మల్లికార్జుననే మరోసారి ధర్మవరం మున్సిపల్‌ కమిషనర్‌గా నియమించడంతో టీడీపీ క్యాడర్‌ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయింది. మల్లికార్జునకు వైసీపీ ముద్ర బలంగా ఉంది. కేతిరెడ్డి ఏది చెప్తే అది చేశారని ..తమను ఇబ్బంది పెట్టిన దాంట్లో కేతిరెడ్డి కంటే మల్లికార్జున పాత్రే ఎక్కువని టీడీపీ నేతలు ఆగ్రహంతో ఉన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో కూడా వైసీపీకి వన్ సైడ్‌గా సహకరించారన్న విమర్శలు ఉన్నాయి. టీడీపీ నేతలను వైసీపీలోకి వెళ్లేలా ఒత్తిళ్లు చేయడంతో పాటు..టీడీపీ నేతల ఆస్తులను సాకుగా చూపి బెదిరించడంలో మల్లికార్జున పాత్ర ఉందన్నది టీడీపీ నేతల ఆరోపణ. మల్లికార్జున నుంచి ఎన్నో రకాలుగా ఇబ్బంది పడ్డామని..మళ్ళీ అతడ్నే కమిషనర్‌గా నియమించడం ఏంటంటూ ప్రశ్నించారు. మల్లికార్జునను ధర్మవరం నుంచి తప్పించాలని రోడ్డెక్కారు కూడా.

టీడీపీ నాయకులు కమిషనర్‌కు వ్యతిరేకంగా స్ట్రాంగ్ వాయిస్‌ వినిపించారు. అయినా మంత్రి సత్యకుమార్ పెద్దగా స్పందించలేదు. చివరకు కమిషనర్‌ని రాజకీయ కోణంలో చూడొద్దని..ఆయన్ని ఒక ప్రభుత్వ అధికారిగా మాత్రమే చూడాలని మంత్రి చేసిన వ్యాఖ్యలు టీడీపీ నేతలకు మరింత ఆగ్రహం తెప్పించాయి. దీంతో ఏకంగా మంత్రి సత్యకుమార్‌ను అడ్డుకుని నిరసన తెలిపారు. దీంతో ధర్మవరంలో బీజేపీ, టీడీపీ మధ్య గ్యాప్ పెరిగిందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

పంతం నెగ్గించుకున్నామన్న జోష్‌లో టీడీపీ
ఇంతలోనే ధర్మవరం టీడీపీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్‌.. మున్సిపల్ కమిషనర్‌ ఇష్యూను మంత్రి సత్యకుమార్‌కు వివరించారు. అతని వల్ల టీడీపీ క్యాడర్‌ పడ్డ ఇబ్బందులు ఏంటి.? ఆయన మీదున్న ఆరోపణలు ఏంటో వివరించారు. సరిగ్గా వారం రోజులకే మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునపై బదిలీ వేటు పడింది. పూర్తిస్థాయిలో బాధ్యతలు తీసుకోగానే ఆయనను ప్రొద్దుటూరుకు బదిలీ చేశారు. ధర్మవరంకు మరో ఆఫీసర్‌ను కమిషనర్ నియమించారు.

అయితే మున్సిపల్‌ కమిషనర్‌ బదిలీతో పంతం నెగ్గించుకున్నామని జోష్‌లో ఉన్నారు టీడీపీ నేతలు. గత ఐదేళ్లు తమకు అండగా నిలిచిన పరిటాల శ్రీరామ్..ఇప్పుడు మరోసారి తమ మనోగతానికి అనుగుణంగా మున్సిపల్ కమిషనర్‌ను బదిలీ చేయించారని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయితే పార్టీ విషయంలో తప్ప.. అడ్మినిస్ట్రేషన్ విషయంలో మొన్నటి వరకు ధర్మవరంలో వేలు పెట్టలేదు పరిటాల శ్రీరామ్‌.

కమిషనర్ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోనని పంతం పట్టినట్లు తెలుస్తోంది. మల్లికార్జునను తప్పించాలని సింగిల్ స్టాండ్‌పై నిలబడి..మంత్రి సత్యకుమార్‌ను ఒప్పించి కమిషనర్‌ను ట్రాన్స్‌ఫర్‌ చేయించారని టీడీపీ క్యాడర్‌ తమ నేతను పొగుడుతోంది. పార్టీ కోసం సీటును త్యాగం చేయడమే కాదు.. తమ కోసం అధికారిని బదిలీ చేయించారని అంటున్నారు టీడీపీ నేతలు.

ఈ తీర్పును అంగీకరించలేం: హరియాణా ఫలితాలపై కాంగ్రెస్ అనుమానాలు