Production of mayonnaise: తెలంగాణలో మయోనైజ్‌పై నిషేధం.. వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం

హోటళ్లలో తనిఖీలు, నియంత్రణ కోసం నియమించిన టాస్క్‌ఫోర్స్‌‌ కమిటీల పనితీరుపై కూడా దామోదర రాజనర్సింహ ఆరా తీశారు.

Production of mayonnaise: తెలంగాణలో మయోనైజ్‌పై నిషేధం.. వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం

Updated On : October 30, 2024 / 8:18 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా మయోనైజ్‌పై బ్యాన్ విధించాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లతో సమీక్షలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొని ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఉత్తర్వులు విడుదల చేయనున్నారు. హోటళ్లలో తనిఖీలు, నియంత్రణ కోసం నియమించిన టాస్క్‌ఫోర్స్‌‌ కమిటీల పనితీరుపై కూడా దామోదర రాజనర్సింహ ఆరా తీశారు. వివిధ రకాల ఆహార పదార్థాలతో కలిపి తినే మయోనైజ్‌ను కల్తీ, ఉడకబెట్టని గుడ్లతో తయారు చేస్తున్నారని, దానివల్ల ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని మంత్రికి అధికారులు వివరించారు.

కేరళలో మయోనైజ్‌పై బ్యాన్ విధించిన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణలోనే దానిపై నిషేధం విధించాలని మంత్రి దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. దీంతో దానిపై నిషేధం విధిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది.

టీటీడీ బోర్డు చైర్మన్‌గా బీఆర్ నాయుడు.. పాలకమండలి కొత్త సభ్యులు వీరే..