టీటీడీ బోర్డు చైర్మన్‌గా బీఆర్ నాయుడు.. పాలకమండలి కొత్త సభ్యులు వీరే..

పాలకమండలి నియామకం జీవోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.

టీటీడీ బోర్డు చైర్మన్‌గా బీఆర్ నాయుడు.. పాలకమండలి కొత్త సభ్యులు వీరే..

Tirumala (Photo Credit : Google)

Updated On : October 30, 2024 / 8:04 PM IST

TTD Trust Board : టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) పాలకమండలి చైర్మన్ గా బీఆర్ నాయుడు నియమితులయ్యారు. 24 మంది సభ్యులతో పాలక మండలి ఏర్పాటైంది. ఈ మేరకు పాలకమండలి నియామకం జీవోను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. టీటీడీ నూతన పాలకమండలిలో తెలంగాణ నుంచి ఐదుగురికి సభ్యులుగా అవకాశం దక్కింది.

టీటీడీ బోర్డు సభ్యులు..
జ్యోతుల నెహ్రూ
వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
ఎంఎస్ రాజు
పనబాక లక్ష్మి
నర్సిరెడ్డి
సాంబశివరావు
సదాశివరావు నన్నపనేని
కృష్ణమూర్తి
కోటేశ్వరరావు
మల్లెల రాజశేఖర్ గౌడ్

జంగా కృష్ణమూర్తి
ఆర్ ఎన్ దర్శన్
జస్టిస్ హెచ్ ఎల్ దత్
శాంతారాం
పి.రామ్మూర్తి
సురభ్ హెచ్ బోరా
తమ్మిశెట్టి జానకీదేవి
బూనుగునూరు మహేందర్ రెడ్డి
అనుగోలు రంగశ్రీ
బూరగపు ఆనంద్ సాయి
సుచిత్ర ఎల్లా
నరేశ్ కుమార్
డా.ఆదిత్ దేశాయ్

* టీటీడీ పాలకమండలి చైర్మన్ గా బీఆర్ నాయుడు
* మొత్తం 24 మంది సభ్యులతో పాలకమండలి నియామకం జీవో విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
* తెలంగాణ నుండి ఐదుగురికి అవకాశం
* కర్నాటక నుంచి ముగ్గురికి అవకాశం
* తమిళనాడు నుంచి ఇద్దరికి అవకాశం

టీటీడీ బోర్డు విషయంలో సీఎం చంద్రబాబు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించారు. సచ్చీలురు, హిందూ సమాజం పట్ల నమ్మకంగా పని చేస్తున్నారో, హిందువుల మనోభావాలకు అనుగుణంగా ఉంటారో వారిని మాత్రమే ఎంపిక చేయాలని మొదటి నుంచి చంద్రబాబు భావించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా మీడియా అధిపతి అయిన బీఆర్ నాయుడిని టీటీడీ ఛైర్మన్ గా నియమించినట్లు సమాచారం. అదే విధంగా ఎమ్మెల్యేలను కూడా పాలక మండలి సభ్యులుగా చేయడం ఆనవాయితీగా ఉంది.

జ్యోతుల నెహ్రూ సీనియర్ ఎమ్మెల్యే..
ప్రశాంతి రెడ్డి.. వైసీపీ ప్రభుత్వంలో కూడా టీటీడీ బోర్డు మెంబర్ గా చేశారు
ఎంఎస్ రాజు.. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మడకశిర ఎమ్మెల్యే..
టీడీపీకి చెందిన వారిలో పనబాక లక్ష్మి మాజీ కేంద్ర మంత్రి..
తెలంగాణకు చెందిన టీడీపీ నేత నన్నూరి నర్సిరెడ్డి..
టీడీపీకి చెందిన సాంబశివరావు
మల్లెల రాజశేఖర్ గౌడ్ నంద్యాలకు చెందిన టీడీపీ నేత
జంగా కృష్ణమూర్తి-గుంటూరుకు చెందిన టీడీపీ నేత
జానకీదేవి-మంగళగిరికి చెందిన టీడీపీ నేత

Also Read : కేసులు, అవినీతి ఆరోపణలు చుట్టుముట్టడంతో జంపింగ్ బాట.. విడుదల దారెటు..!