Nalgonda Murder: నల్గొండ జిల్లాలో దారుణం, అర్ధరాత్రి దంపతుల హత్య

నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. అర్ధరాత్రి ఆరుబయట నిద్రిస్తున్న భార్యాభర్తలను గుర్తు తెలియని వ్యక్తులు అతికొరతకంగా నరికి చంపారు. ఈ ఘటన నేరుడుగొమ్మ మండలం బుగ్గతండాలో జరిగింది.

Nalgonda Murder: నల్గొండ జిల్లాలో దారుణం, అర్ధరాత్రి దంపతుల హత్య

Nalgonda Murder

Updated On : April 19, 2021 / 11:00 AM IST

Nalgonda Murder: నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. అర్ధరాత్రి ఆరుబయట నిద్రిస్తున్న భార్యాభర్తలను గుర్తు తెలియని వ్యక్తులు అతికొరతకంగా నరికి చంపారు. ఈ ఘటన నేరుడుగొమ్మ మండలం బుగ్గతండాలో జరిగింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో తమ ఇంటి ఆరుబైట నిద్రిస్తున్న బుల్లి, నేనావ‌త్ సోమాని దంపతులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి హతమార్చారు. ఉదయం చుట్టుపక్కలవారు లేచి చూసేసరికి ఇద్దరు రక్తపు మడుగులో పడిఉన్నారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. భూవివాదమే ఈ హత్యకు కారణమని తెలుస్తుంది. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం సాయంతో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.