Wife Killed Husband : కూతురు సాయంతో భర్తను హత్య చేసిన భార్య.. ఎందుకో తెలుసా?

ప్రకాశ్ రావు మృతిపై అనుమానం ఉందని సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన టౌన్ సీఐ ఉపేందర్ ప్రకాశ్ రావు హత్య ఉదంతాన్ని ఛేదించారు.

Wife Killed Husband : కూతురు సాయంతో భర్తను హత్య చేసిన భార్య.. ఎందుకో తెలుసా?

Wife killed husband (1)

Updated On : November 8, 2023 / 9:34 AM IST

Wife Killed Husband In Sirisilla : సిరిసిల్ల జిల్లాలో దారుణం జరిగింది. వేధింపులకు గురి చేస్తున్న భర్తను భార్య హత మార్చారు. కూతురు సాయంతో భర్తను భార్య హత్య చేసింది. మద్యానికి బానిసై, వివాహేతర సంబంధాలకు అలవాటుపడి ఇంట్లో వారిని దుర్భాషలాడటం, కొట్టడంతో విసుగెత్తిపోయిన భార్య.. కూతురు సాయంతో భర్తను దారుణంగా హత్య చేశారు. శవాన్ని మాయం చేసే ప్రయత్నంలో వారం రోజులు మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచారు. మృతదేహాన్ని ఇంట్లోనే పూడ్చి పెట్టాలని భావించారు. కుదరకపోవడంతో పెట్రోల్ పోసి తగలబెట్టే ప్రయత్నం చేశారు. ఏదీ కుదరకపోవడంతో హడావుడిగా అంత్యక్రియలు చేశారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణం శివనగర్ కు చెందిన లేచర్ల ప్రకాశ్ రావు (44) జల్సాలకు అలవాటుపడ్డాడు. ఇతర మహిళలతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నాడు. మద్యానికి బానిసై ఇంట్లో వారిపై తరచూ దాడికి దిగుతున్నాడు. వేధింపులు తట్టుకోలేని భార్య స్వప్న, కుమార్తె ఉషశ్రీ ఎలాగైనా అతన్ని చంపాలనుకున్నారు. ప్లాన్ ప్రకారం నవంబర్ 1వ తేదీ రాత్రి భార్య స్వప్న భర్త ప్రకాశ్ రావు మెడపై కూరగాయలు కోసే కత్తితో దాడి చేయగా, కూతురు తండ్రి ముఖంపై దిండుతో ఒత్తిపట్టి హత్య చేశారు.

America : స్కూల్ లో 5కే రన్ రేస్ లో పరుగెత్తుతూ గుండె పోటుతో బాలుడు మృతి

అనంతరం మృతదేహాన్ని గొడ్డలితో ముక్కలు ముక్కలు చేసేందుకు ప్రయత్నించారు. కుదరకపోవడంతో మృతదేహాన్ని మాయం చేయాలని ఇంట్లోనే గుంత తవ్వి పాతి పెడదామనుకున్నారు. కానీ, అలా చేస్తే శవం నుంచి వాసన వచ్చి విషయం బయటికి తెలుస్తుందని భావించారు. పెట్రోల్ పోసి కాల్చివేసే ప్రయత్నం చేసినా మృతదేహం పూర్తిగా కాలిపోలేదు. దీంతో స్వప్న నవంబర్ 3వ తేదీన తన తమ్ముడితో మరింత పెట్రోల్ తెప్పించి మృతదేహంపై పోసి నిప్పంటించారు.

అయితే, మంటలు ఎగిసిపడటంతో తెలుస్తుందని నీళ్లు, దుప్పట్లతో మంటలు ఆర్పివేశారు. ఇలా కూడా మృతదేహాన్ని మాయం చేయడం కుదరకపోవడంతో ఎట్టకేలకు హత్యను కాస్తా ఆకస్మిక మృతిగా చిత్రించి దహనం సంస్కారాలు చేయాలని ప్లాన్ చేశారు. అందులో భాగంగా నవంబర్ 4న నిందితురాలు తన చిన్నాన్నను తెల్లవారుజామున ఇంటికి పిలిపించుకుని జరిగిన విషయాన్ని వివరించింది. ఈ క్రమంలో ప్రకాశ్ రావు నిద్రలో చనిపోయినట్లు బంధువులకు సమాచారం ఇచ్చారు.

US Court : భార్యను పొడిచి చంపిన భారతీయుడికి జీవిత ఖైదు విధించిన అమెరికా కోర్టు

చివరి చూపు కోసం కొంతమంది బంధువులు రాగానే హుటాహుటిన విద్యానగర్ లోని వైకుంఠధామంలో దహన సంస్కారాలు పూర్తి చేశారు. కాగా, ప్రకాశ్ రావు నిద్రలోనే చనిపోయాడని బంధువులకు సమాచారం ఇచ్చిన నిందితులు.. బంధువులందరూ వచ్చే వరకు ఎదురుచూడకుండా దహన సంస్కారాలు పూర్తి చేయడంతో మృతిపై పలువురికి అనుమానం వచ్చింది. ఈ క్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్ స్పెక్టర్ మృతుడి ఇంటికి వెళ్లి చూడగా తాళం వేసి ఉంది.

ఇంట్లో నుంచి దుర్వాసన వచ్చింది. దీంతో ప్రకాశ్ రావు మృతిపై అనుమానం ఉందని సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన టౌన్ సీఐ ఉపేందర్ ప్రకాశ్ రావు హత్య ఉదంతాన్ని ఛేదించారు. నిందితులు స్వప్న, ఉషశ్రీని అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు. హత్యకు సహకరించిన మరో ఇద్దరు పరారీలో ఉన్నారని వారి కోసం గాలిస్తున్నట్లు సీఐ ఉపేందర్ పేర్కొన్నారు.