Hyderabad : మద్యం బాబులకు షాక్, రెండు రోజులు షాపులు బంద్

మద్యం బాబులకు షాక్ ఇచ్చే న్యూస్. రెండు రోజల పాటు మద్యం దుకాణాలు తెరుచుకోవు. కల్లు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు కూడా మూతపడనున్నాయి. హైదరాబాద్ నగరంలో బోనాలు జరుగనున్న నేపథ్యంలో అబ్కారీ శాఖ మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Hyderabad : మద్యం బాబులకు షాక్, రెండు రోజులు షాపులు బంద్

Wine

Updated On : July 31, 2021 / 12:56 PM IST

Wine Shops Closed : మద్యం బాబులకు షాక్ ఇచ్చే న్యూస్. రెండు రోజల పాటు మద్యం దుకాణాలు తెరుచుకోవు. కల్లు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు కూడా మూతపడనున్నాయి. హైదరాబాద్ నగరంలో బోనాలు జరుగనున్న నేపథ్యంలో అబ్కారీ శాఖ మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. పాతబస్తీ బోనాల నేపథ్యంలో హైదరాబాద్ నగర పరిధిలోని మద్యం, కల్లు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లను ఆదివారం, సోమవారం మూసివేయాలని అధికారులు వెల్లడించారు.

Read More : Tokyo Olympics : ఒలింపిక్ హాకీ, మహిళలు అదరగొట్టారు

ఆషాడ మాస బోనాలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. గోల్కోండ బోనాల అనంతరం ఇతర ప్రాంతాల్లో బోనాలు జరుగుతుంటాయి. సికింద్రాబాద్ బోనాలు పూర్తయిన సంగతి తెలిసిందే. అనంతరం 2021, ఆగస్టు 01వ తేదీన పాతబస్తీతో పాటు ఇతర ప్రాంతాల్లో బోనాలు జరుగనున్నాయి. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఉండేందుకు ప్రభుత్వం పలు ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ నగరంలో పోలీసులు పకడ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. బోనాలు, ఫలహార బండ్ల ఊరేగింపు, రంగం కార్యక్రమాలు జరుగుతాయి. నిర్వాహకులు ఆలయాలను అందంగా ముస్తాబు చేస్తున్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే..కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.