woman constable: మహిళా కానిస్టేబుల్ దారుణ హత్య.. తమ్ముడే హంతకుడు
రాయపోలుకు చెందిన నాగమణి హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తోంది. ఆమెకు గతంలో ..

woman constable died
woman constable : ప్రేమ వివాహం చేసుకున్న మహిళా కానిస్టేబుల్ పాలిట సొంత తమ్ముడే యముడయ్యాడు. నెల రోజుల క్రితం మరో వ్యక్తిని కులాంతర వివాహం చేసుకోవటాన్ని జీర్ణించుకోలేక పోయిన ఆమె సోదరుడు.. విధులకు వెళ్తుండగా కారుతో ఢీకొట్టి, వేట కొడవలితో అక్కను దారుణంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: Sobhita Shivanna : పెళ్ళైన ఏడాదిలోనే ఆత్మహత్య చేసుకున్న నటి శోభిత.. ఆమె గురించి తెలుసా..
రాయపోలుకు చెందిన నాగమణి హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తోంది. ఆమెకు గతంలో వివాహం జరిగింది. పది నెలల క్రితం భర్తతో విడిపోయి విడాకులు తీసుకుంది. అయితే, గత పదిహేను రోజుల క్రితం మరో వ్యక్తిని కులాంతర వివాహం చేసుకుంది. అక్క కులాంతర వివాహం చేసుకోవడాన్ని ఆమె తమ్ముడు పరమేశ్ జీర్ణించుకోలేక పోయాడు. దీంతో అక్కను హత్య చేసేందుకు నిర్ణయించుకున్నాడు. స్కూటీపై విధులకు వెళ్తున్న నాగమణిని కారుతో ఢీకొట్టి వేట కొడవలితో దాడిచేసి హతమార్చాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళా కానిస్టేబుల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఆస్తి విషయంలో గొడవే హత్యకు కారణమా?
ఆస్తి విషయంలో నెలకొన్న వివాదం కారణంగానే నాగమణిని తమ్ముడు హత్యచేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. తల్లిదండ్రులు లేకపోవడంతో నాగమణిని అన్నీతానై తమ్ముడు పరమేశ్ చూసుకున్నాడు. నాగమణికి ఇంతకుముందే వివాహం కావడంతో తనకు కొంత భూమిని అప్పగించారు. అయితే, తరువాత కాలంలో నాగమణికి మొదటి భర్తతో విడాకులయ్యాయి. దీంతో తన వాటాకింద ఉన్న పొలాన్ని తమ్ముడికి అప్పగించింది. అయితే, నాగమణి రెండో వివాహం చేసుకుంది. కొద్దిరోజుల క్రితం శ్రీకాంత్ అనే వ్యక్తిని కులాంతర వివాహం చేసుకుంది. ఆ తరువాత భూమిలో తన వాటా తనకు ఇవ్వాలని తమ్ముడిపై ఒత్తిడి చేసినట్లు తెలిసింది. దీంతో ఆగ్రహించిన పరమేశ్ నాగమణిని హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది.