కరోనాతో పోరాడి గెలిచి బిడ్డకు జన్మ

కరోనా వైరస్ తో పోరాడి గెలిచిన ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలోని జహంగీర్ పూరి పోలీసు స్టేషన్ లో దేవేందర్ అనే వ్యక్తి కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం అతనికి పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయన భార్యకు కూడా పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ గా తేలింది. కాగా కరోనా వైరస్ సోకిన సమయంలో ఆమె గర్బిణీ కావడం గమనార్హం.
ఈ క్రమంలో భార్యాభర్తలను ఎల్ ఎన్ జేపీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. వైద్యులు వారికి చకిత్స అందించారు. భార్యాభర్తలు ఇద్దరూ కరోనాతో పోరాడి గెలిచారు. ఇద్దరికి కరోనా నెగెటివ్ వచ్చింది. గర్భిణీ కోలుకోవడంతో ఐసోలేషన్ వార్డు నుంచి డిశ్చార్జ్ చేశారు. (మే 8, 2020) ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు.
Read Here>> జూన్‌లోనే remdesivir.. 10 లక్షల డోసులతో రెడీ!