Murder : సహజీవనం కొనసాగించలేదని మహిళ దారుణ హత్య
భర్త చనిపోయిన వెంకటలక్ష్మి అనే మహిళతో వెంకటేష్ అనే వ్యక్తి సహజీవనం చేశారు. వెంకటేష్ ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. అతడిని వదిలి వేసి దూరంగా ఉంటుంది.

Murder
Woman murdered : హైదరాబాద్ లో దారుణం జరిగింది. సహజీవనం చేస్తున్న మహిళను ఓ వ్యక్తి హత్య చేశాడు. మహిళతో వివాదాలు తలెత్తడంతో ఆమెపై కిరోసిన్ పోసి తగులపెట్టి హత్య చేశాడు. ఈ సంఘటన కూకట్ పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…భర్త చనిపోయిన వెంకటలక్ష్మి అనే మహిళతో వెంకటేష్ అనే వ్యక్తి సహజీవనం చేశారు. వెంకటేష్ ప్రవర్తన సరిగ్గా లేకపోవడం కారణంగా ఆమెను చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. దీంతో ఆమె అతడిని వదిలి వేసి దూరంగా ఉంటుంది. అప్పటి నుండి వెంకటేష్ ఆమెను తనతో కలిసి ఉండాలని వెంటపడేవాడు.
Lock Down : తెలంగాణలో ఫస్ట్ టైం ఒమిక్రాన్ కారణంగా గ్రామంలో లాక్ డౌన్
నిన్న సాయంత్రం 8 గంటలకు వెంకటేష్ ఆమె ఇంటికి వెళ్లాడు. ఇంట్లోకి వెళ్లి వెంకటలక్ష్మితో గొడవ పడి, ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఇద్దరికీ మంటలు అంటుకోవటంతో కేకలు వేయగా స్థానికులు వచ్చి తలుపులు పగులగొట్టి మంటలను ఆర్పివేశారు.
అప్పటికే తీవ్రగాయాలతో వెంకటలక్ష్మి మృతి చెందగా, తీవ్రగాయల పాలైన వెంకటేష్ ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.