జూన్ 8 నుంచి యాదాద్రి ఆలయ పూజలు ప్రారంభం

  • Published By: Subhan ,Published On : June 3, 2020 / 08:15 AM IST
జూన్ 8 నుంచి యాదాద్రి ఆలయ పూజలు ప్రారంభం

Updated On : June 3, 2020 / 8:15 AM IST

యాదగిరి గుట్టపై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి జూన్ 8నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. మొదలుకానున్న ఆర్జిత పూజల నిర్వహణలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ట్రాన్స్‌పోర్ట్‌లో ఆంక్షలు విధించారు. కొండ కిందనుంచి భక్తులు కాలినడకనే చేరుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి వాహనాలకు అనుమతివ్వరు. 

యాదాద్రిలో వివిధశాఖల అధికారులతో సమావేశమైన యాదాద్రి ఆలయ ఈవో ఎన్‌ గీత ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గుడికి దర్శనానికొచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్టు వెల్లడించారు. కొండ కింది నుంచి పై వరకు కాలినడకన వెళ్లే భక్తులు భౌతికదూరం పాటించేలా నిర్ణీత బాక్సులను ఏర్పాటుచేశామని పేర్కొన్నారు. వారంపాటు దర్శనాల ప్రక్రియను పర్యవేక్షించి అవసరమతే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. 

250 జంటల నుంచి 50 జంటలకు:
కరోనాకు ముందు.. యాదాద్రి కొండపై ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాల కోసం ఒక్కో బ్యాచ్‌కు ఒక హాల్‌లో 250 జంటలు కూర్చునేలా అనుమతించేవారు. ప్రస్తుత పరిస్థితిని బట్టి ఒక్కో బ్యాచ్‌లో 50 మంది దంపతులు మాత్రమే కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో గీత చెప్పారు. దర్శనాలను గతంలో టైం టేబుల్‌ ప్రకారమే జరుగుతాయని ఆమె వెల్లడించారు. ర్శనాలకు పదేండ్లలోపు పిల్లలు, 65 ఏండ్లుపైబడిన వృద్ధులకు అనుమతిలేదని ఈవో గీత స్పష్టంచేశారు. 

Read: గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగులపై విరిగిపడ్డ ఫ్యాన్