Yoga Mahotsav: ఆజాదీకా అమృత్ మహోత్సవ్.. 200దేశాల్లో యోగా మహోత్సవం

ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా శుక్రవారం యోగా మహోత్సవ్ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ఎల్బీ స్టేడియంలో ఉదయం 6గంటలకు నిర్వహిస్తుండగా హైదరాబాద్ వాసులంతా సద్వినియోగపరచుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.

Yoga Mahotsav: ఆజాదీకా అమృత్ మహోత్సవ్.. 200దేశాల్లో యోగా మహోత్సవం

Yoga Mahotsav (1)

Updated On : May 26, 2022 / 8:34 PM IST

Yoga Mahotsav: ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా శుక్రవారం యోగా మహోత్సవ్ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ఎల్బీ స్టేడియంలో ఉదయం 6గంటలకు నిర్వహిస్తుండగా హైదరాబాద్ వాసులంతా సద్వినియోగపరచుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.

జూన్ 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా శుక్రవారం నుంచే కౌంట్ డౌన్ ప్రారంభించారు. 25రోజుల పాటు వివిధ వేదికల ద్వారా కౌంట్ డౌన్ లో భాగంగా కేంద్ర సాంస్కృతిక, ఆయూష్ శాఖలు పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

కేంద్ర మంత్రులు సర్వానంద్ సోనూవాలా, కిషన్ రెడ్డిలు ఎల్బీ స్టేడియంలో చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఆయూష్ షిప్పింగ్ మంత్రి సర్వానంద సోనావాలా శుక్రవారం ఉదయం జరగబోయే యోగా కార్యక్రమంలో పాల్గొంటారు.

Read Also : ముంబై ఎస్ బీ ఐలో ఉద్యోగాల భర్తీ

ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి.. “భారత ప్రభుత్వం తరపున వందరోజుల ముందు ఢిల్లీలో నిర్వహించాం. జూన్ 21న పెద్ద ఎత్తున జరిగే యోగా కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలి. 200దేశాలలో అంతర్జాతీయ యోగా డేను జరుపుకుంటున్నాయని” అన్నారు.

“వచ్చే జూన్ 21న మోడీ ఆధ్వర్యంలో యోగాడే విజయవంతంగా జరపబడుతుంది. ఆయూష్‌తో పాటు కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో యోగా డే నిర్వహిస్తున్నాం. శుక్రవారం నగరంలో యోగా వేడుకలు నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ప్రజలు పాల్గొనాలి. మానవ సమాజం ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా జీవించేందుకు యోగా ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుత్వం లోని అన్ని శాఖలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. క్రీడాకారులు, నటులు రేపు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు” అని కేంద్ర మంత్రి సోనావాలా అన్నారు.