ప్రేమోన్మాదం : యువతిపై దాడి, 18 సార్లు కత్తితో పొడిచాడు

  • Published By: madhu ,Published On : October 30, 2020 / 10:47 AM IST
ప్రేమోన్మాదం : యువతిపై దాడి, 18 సార్లు కత్తితో పొడిచాడు

Updated On : October 30, 2020 / 11:17 AM IST

Young Man Attacks 18 Years Girl With Knife : ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి తెస్తూ..దారుణాలకు తెగబడుతున్నారు. ఏకంగా హత్యలకు పాల్పడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 18 ఏళ్ల యువతిని ప్రేమ పేరిట వేధించిన యువకుడు..కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఏకంగా 18 చోట్ల పొడిచి ముళ్లపొదల్లోకి తోసివేశాడు. ఆమె పరిసస్థితి విషమంగా ఉంది.



వివరాల్లోకి వెళితే…ఇల్లందు సత్యనారాయణపురంలో ఓ యువతి కుటుంబంతో నివాసం ఉంటోంది. స్థానికంగా ఉండే సందీప్ ప్రేమ పేరిట ఆమెను వేధించసాగాడు. గత ఆరు నెలలుగా ఇది కొనసాగుతోంది. ఈ విషయం పెద్దలకు తెలిసిందే. ఈ క్రమంలో యువతి అతడిని దూరం పెట్టింది. దీంతో అతను ఆమెపై కోపం పెంచుకున్నాడు.



2020, అక్టోబర్ 29వ తేదీ గురువారం అర్ధరాత్రి మాట్లాడాలని యువతిని బయటకు పిలిచాడు. అనంతరం తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. శరీరంపై 18 కత్తిపోట్లు ఉన్నాయని తెలుస్తోంది. అటువైపుగా వస్తున్న పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు పారిపోతున్న యువకుడిని పట్టుకున్నారు. చేతికి రక్తం ఉండటాన్ని గమనించి అదుపులోకి తీసుకున్నారు. యువకుడిని విచారించగా దాడి విషయం చెప్పాడు.



ముళ్లపొదల్లో రక్తపు మడుగులో ఉన్న యువతిని ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. యువతి పరిస్థితి సీరియస్ గా ఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు.