సమ్మర్ ఎఫెక్ట్  : చలివేంద్రంలో మట్టి కుండ చోరీ 

  • Published By: veegamteam ,Published On : April 17, 2019 / 04:54 AM IST
సమ్మర్ ఎఫెక్ట్  : చలివేంద్రంలో మట్టి కుండ చోరీ 

Updated On : April 17, 2019 / 4:54 AM IST

జమ్మికుంటలో ఓ విచిత్రమైన దొంగతనం జరిగింది. అందరూ సద్దుమణిగారు..ఎవ్వరూ లేరు..ఇదే అదనుగా అటు ఇటూ చూశారు చోరీకి వచ్చిన ఇద్దరు యువకులు.. ఒకరు..ఇద్దరు మించి ఎవ్వరూ కనిపించలేదు. అంతే వారు వచ్చిన పనిని గుట్టు చప్పుడు కాకుండా కానిచ్చేశారు.  డబ్బు..బంగారం..స్మార్ట్ ఫోన్లు వంటి ఖరీదైనవి దొంగతనం చేస్తుంటారు. కానీ ఇద్దరు యువకులు చేసిన ఈ దొంగతనం ఔరా..అనిపించకమానదు. 
 

అసలే ఎండాకాలం..ఎండలు మండిపోతున్నాయి. చల్లటి నీరు తాగాలని అన్పిస్తుంది. bమరి కూల్ వాటర్ తాగాలంటే ఫ్రిజ్ ఉండాలి..లేదా ఓ మట్టి కుండ ఉండాలి..మట్టి కుండలు కొనాలంటే..కనీసం ఓ చిన్నపాటి సైజ్ ఉన్నది కొనాలన్నా కనీసం రూ.150 పెట్టాల్సిందే.కానీ అదికూడా కొనటం ఇష్టం లేదేమో..లేదా డబ్బుల్లేవేమో..మరి ఏంచేయాలి..అందుకే ఓ ప్లాన్ వేశారు ఆ  ఇద్దరు యువకులు. ‘దొంగతనం’చేయాలను నిర్ణయించుకున్నారు. పక్కాగా ప్లాన్ కూడా వేసుకున్నారు. బైక్ పై వచ్చారు.  ఆ రోడ్ల పక్కన ఎన్నో చలివేంద్రాలున్నాయి..వాటిలో బోల్డన్ని మట్టికుండలు పడి ఉంటాయి. ఒక్కటి పట్టుకుపోతే పోలా అనుకున్నారు..లేదా ఓ మట్టికుండ కోసం వందలు ఖర్చు చేయటం ఎందుకునుకున్నారో గానీ..ఆ యువకులిద్దరు చలివేంద్రంలో ఉండే ఓ మట్టి కడవ (పెద్ద కుండ)ను ఎత్తుకెళ్లారు. 

ఆ…ఆ..మంచి ఐడియా మనం కూడా అలా చేస్తే పోలా అనుకుంటున్నారా ఏమిటీ కొంపదీసి..వద్దండీ బాబూ..రోజు ఎంతోమందికి ఈ మండే ఎండల్లో చల్లటి నీరు అందించాలనే మంచి ఉద్ధేశ్యంతో చలివేంద్రాలను కొందరు ఏర్పాటు చేస్తుంటారు. దానికి చేతనైతే మనం కూడా సాయం చేద్దాం..లేదంటే అభినందిద్దాం..అంతే తప్పా ఇటువంటి పనులు మాత్రం చేయవద్దు..ప్లీజ్.