వైఎస్ షర్మిల అరెస్ట్

వైఎస్ షర్మిల అరెస్ట్

Ys Sharmila Arrested On Telugu Thalli Fly Over

Updated On : April 15, 2021 / 7:09 PM IST

Ys Sharmila Arrested: వైఎస్‌ షర్మిలను హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు పోలీసులు. ఇందిరాపార్క్‌ నుంచి లోటస్‌పాండ్‌కు పాదయాత్రగా వెళ్తున్న ఆమెను తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు.

పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు చెప్పినా వినకుండా ముందుకు వెళ్లడానికి ప్రయత్నించడంతో షర్మిలను, ఆమె అనుచరులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ సమయంలోనే పోలీసులకు , షర్మిల అనుచరులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది.

తెలంగాణాలో ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ షర్మిల హైదరాబాద్ ఇందిరా పార్క్‌ దగ్గర కొలువు దీక్ష చేపట్టగా.. అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోగా.. ఇందిరా పార్క్ నుంచి లోటస్ పాండ్ వరకు పాదయాత్ర చేపట్టారు.