YS.Sharmila Party : వైఎస్ఆర్ జయంతి, పార్టీపై షర్మిల అధికారిక ప్రకటన
తెలంగాణలో మరో పార్టీ ఆవిర్భవించబోతోంది. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా 2021, జూలై 08వ తేదీ గురువారం పార్టీపై అధికారిక ప్రకటన చేయబోతున్నారు వైఎస్ షర్మిల.

Ys Sharmila
YS.Sharmila To Launch New Party : తెలంగాణలో మరో పార్టీ ఆవిర్భవించబోతోంది. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా 2021, జూలై 08వ తేదీ గురువారం పార్టీపై అధికారిక ప్రకటన చేయబోతున్నారు వైఎస్ షర్మిల. గురువారం ఉదయం వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి నివాళులర్పించనున్నారు. అనంతరం నేరుగా హైదరాబాద్ కు రానున్నారు. హైదరాబాద్‌లోని జె.ఆర్.సి కన్వెన్షన్ సెంటర్ వేదికగా వైఎస్సార్ టీపీ ఆవిర్భావ సభ జరగనుంది. పార్టీ జెండాను, ఎజెండాను ప్రకటించనున్నారు వైఎస్ షర్మిల
Read More : Burned Woman On Highway : భార్యకు నిప్పు పెట్టిన భర్త… హైవేపై పడేసి పరార్
అధికారంలోకి వస్తే చేయబోయే పనులను చెప్పనున్నారు. రైతురాజ్యం, ఉద్యోగాల కల్పన.. వైఎస్సార్ టీపీ ప్రధాన అజెండా అని షర్మిల అనుచరులు చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు పరిశ్రమల స్థాపనతో పెద్ద ఎత్తున ఉద్యోగాలు దక్కేలా కార్యాచరణను, ప్రతి పేద విద్యార్థికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తామని హామీ ఇవ్వనున్నారని సమాచారం. విద్య-వైద్య రంగాల్లో సమూలమార్పులు, ఆరోగ్యశ్రీకి పూర్వవైభవం, వైద్య చికిత్సకు పూర్తి భరోసా ఇచ్చేలా కీలక ప్రసంగం చేయనున్నట్లు తెలుస్తోంది.
Read More : Petrol Ki Baat : మన్ కీ బాత్ కాదు పెట్రోల్ కీ బాత్ చేయండి
పేదలకు పక్కా ఇళ్లు అంశాన్ని షర్మిల ప్రధానంగా ప్రస్తావించబోతున్నట్లు సమాచారం. అధికారం కట్టబెడితే ఇందిరమ్మ ఇళ్ల స్కీం మాదిరిగా…డబుల్ బెడ్ రూం స్థాయి ఇళ్లను…నిర్ణీత సమయంలో కట్టించి ఇస్తామని షర్మిల హామీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అటు నీటి ప్రాజెక్ట్‌లపై వైఎస్‌ఆర్ ముద్రను ప్రముఖంగా ప్రస్తావించే అవకాశం ఉంది. తెలంగాణలో 36 ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేసింది తన తండ్రేనని వివరించనున్నట్టు తెలుస్తోంది. వైఎస్ హయాంలో రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చినట్లుగా తమ పార్టీని అధికారంలోకి తెస్తే.. ఉచిత ఎరువులు, పంటలకు భారీగా గిట్టుబాటు ధర కల్పించేలా ప్రకటన చేస్తారని సమాచారం.