Nalgonda : నల్గొండలో షర్మిల పర్యటన
వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో పర్యటించిన ఈమె..తాజాగా..నల్గొండ జిల్లా పర్యటనకు సిద్ధమయ్యారు. 2021, జూన్ 16వ తేదీ బుధవారం నల్గొండ జిల్లా ప్రధాన పట్టణాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆమె పలు కుటుంబాలను పరామర్శించనున్నారు.

YS Sharmila : వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో పర్యటించిన ఈమె..తాజాగా..నల్గొండ జిల్లా పర్యటనకు సిద్ధమయ్యారు. 2021, జూన్ 16వ తేదీ బుధవారం నల్గొండ జిల్లా ప్రధాన పట్టణాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆమె పలు కుటుంబాలను పరామర్శించనున్నారు.
ఉదయం 7.30 గంటలకు లోటస్ పాండ్ లోని నల్గొండకు బయలుదేరనున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు రాక..ఉపాధి దొరక్క..ఇబ్బందులు పడుతూ…ఆత్మహత్యకు యత్నించిన నీలకంఠ సాయిని..అతని కుటుంబాన్ని షర్మిల పరామర్శించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12.45 గంటలకు హుజూర్ నగర్ లోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించనున్నారు.
కోదాడ సమీపంలోని దొండపాడులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుచరుడు, కుటుంబ సన్నిహితులు గున్నం నాగిరెడ్డి కుటుంబాన్ని వైఎస్ షర్మిల పరామర్శించనున్నారు. కార్యక్రమాలు పూర్తయిన తర్వాత..నేరుగా..హైదరాబాద్ లోని తన నివాసానికి చేరుకుంటారు షర్మిల.