YS Sharmila : రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశానికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని వైఎస్సార్ నమ్మారు : వైఎస్ షర్మిల ఆసక్తికర ట్వీట్

గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీకి షర్మిల దగ్గరవుతున్నారు.. కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్ టీపీ విలీనం చేస్తారా? లేకపోతే రానున్న ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటారా? అనే చర్చ జరుగుతోంది.

YS Sharmila : రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశానికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని వైఎస్సార్ నమ్మారు : వైఎస్ షర్మిల ఆసక్తికర ట్వీట్

YS Sharmila (4)

Updated On : July 8, 2023 / 6:49 PM IST

YS Sharmila Interesting Tweet : వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరుగుతున్న వేళ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. వైఎస్సార్ ను స్మరించుకుంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేయగా షర్మిల ధన్యవాదాలు చెప్పారు. వైఎస్సార్ మీ గుండెల్లో చిరస్థాయిగా నిలిచినందుకు రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. రాహుల్ నాయకత్వంలో దేశానికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని వైఎస్సార్ నమ్మినట్లు ట్వీట్ చేశారు. దీంతో షర్మిల కాంగ్రెస్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోందని జోరుగా ప్రచారం జరుగుతోంది.

కాంగ్రెస్ పార్టీకి వైఎస్సార్ సీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దగ్గరవుతున్నారనే ప్రచారం చాలా రోజులుగా ఉంది. రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా గత నెల (జూన్) 19న కూడా రాహుల్ కు షర్మిల ట్వీట్ చేశారు. రాహుల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె ట్వీట్ చేశారు. ఇవాళ (శనివారం) కూడా రాహుల్ గాంధీ వైస్సాఆర్ జయంతి సందర్భంగా ఆయనను గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధికి, వారి సంక్షేమం కోసం వైఎస్సార్ తన జీవితాన్ని త్యాగం చేశారని, చాలా గొప్ప వ్యక్తి అని వైఎస్సాార్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు అంటూ రాహుల్ ట్వీట్ చేశారు.

MP Venkatesh : తెలంగాణ ఏర్పాటుపై విషం చిమ్మిన ప్రధాని మోదీ రాష్ట్రంపై వివక్ష చూపుతున్నారు : ఎంపీ వెంకటేష్

అయితే, రాహుల్ చేసిన ట్వీట్ కు వైఎస్ షర్మిల రీ ట్వీట్ చేశారు. రాహుల్ ట్వీట్ కు షర్మిల రీ ట్వీట్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. షర్మిల రీ ట్వీట్ లో రాహుల్ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందంటూ రాజశేఖర్ రెడ్డి అనుకునే వారని, వైఎస్సార్ తీసుకొచ్చిన పథకాలు ఇప్పటికీ దేశానికి ఆదర్శంగా ఉన్నాయని రాహుల్ అన్న విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన సేవ చేశారని రాహుల్ ట్వీట్ లో పేర్కొన్నారని ఆమె తెలిపారు. రాహుల్ గాంధీ నాయకత్వంలోనే ఈ దేశానికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని అప్పట్లో నమ్మిన వ్యక్తి వైఎస్సార్ అంటూ ఆ ఒక్క లైన్ షర్మిల ట్వీట్ లో పేర్కొనడం ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఎందుకంటే రాహుల్ గాంధీ నాయకత్వాన్ని రాజశేఖర్ రెడ్డి కోరుకున్నారు.. రాహుల్ నాయకత్వంలోనే దేశానికి ఉజ్వల భవిష్యత్ ఉందని కోరుకున్నారని షర్మిల చెప్పడం అనేది ఇప్పుడు ఆసక్తికరమైన ఆంశంగా మారింది. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీకి షర్మిల దగ్గరవుతున్నారు.. కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్ టీపీ విలీనం చేస్తారా? లేకపోతే రానున్న ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటారా? అనే చర్చ జరుగుతోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సన్నిహుతుడిగా, అత్యంత ఆప్తుడుగా ఉన్న కేవీపీ రామచంద్రారావు కూడా షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారంటూ ఇటీవల వ్యాఖ్యానించారు.

YS Sharmila: ప్రజాప్రస్థానం పాదయాత్రను మళ్లీ మొదలుపెడతాను: షర్మిల

తెలంగాణ, ఏపీ రాజకీయాల్లో కూడా చాలా రోజులుగా ఈ చర్చ సాగుతోంది. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరుస్తూ ఇవాళ షర్మిల కూడా ఇలాంటి ట్వీట్ చేయడం ఆసక్తి రేకెత్తిస్తోంది. రాహుల్ నాయకత్వాన్ని వైఎస్సార్ నమ్మారని షర్మిల ట్వీట్ చేసినప్పటికీ ఆమె నమ్మితేనే అలాంటి ట్వీట్ చేస్తారనే ఒక అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో ఉంది. కాబట్టి కచ్చితంగా షర్మిల కాంగ్రెస్ వైపు వెళ్తున్నట్లు ఈ ట్వీట్ తో మరోసారి బలంగా రుజువు  అవుతుందని చెప్పవచ్చు. షర్మిల కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్తారా లేకా కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేస్తారా? అనే చర్చ జోరుగా సాగుతోంది.

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే నిర్ణయానికి షర్మిల ఇప్పటికే వచ్చారు కాబట్టి.. అక్కడ వైఎస్సార్ కుటుంబానికి అత్యంత సన్నిహితులు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ మద్దతు అనేది షర్మిలకు అనివార్యం. కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటేనే పాలేరులో షర్మిల గెలిచే అవకాశాలుంటాయి కాబట్టి,  షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడమో లేకపోతే ఆ పార్టీతో అలయెన్స్ వెళ్లడమో అనేది తప్పనిసరి.