YS Sharmila: పోలీసులు ఈ మహిళను తీసుకెళ్లి తీవ్రంగా కొట్టి, గాయపర్చారు.. ఆమె వద్దకు వెళ్లాను: షర్మిల

అసలు ఒక మహిళను ఇంత దారుణంగా కొట్టే హక్కు మీకు ఎక్కడిది?

YS Sharmila: పోలీసులు ఈ మహిళను తీసుకెళ్లి తీవ్రంగా కొట్టి, గాయపర్చారు.. ఆమె వద్దకు వెళ్లాను: షర్మిల

YS Sharmila

Updated On : August 20, 2023 / 7:35 PM IST

YS Sharmila – LB Nagar: హైదరాబాద్‌(Hyderabad)లోని ఎల్బీనగర్‌లో పోలీసులు అకారణంగా స్టేషన్ కు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టి గాయపర్చిన గిరిజన మహిళ లక్ష్మిని ఇవాళ పరామర్శించానని వైఎస్సార్టీపీ (YSRTP) అధినేత్రి షర్మిల తెలిపారు. మహిళలపై జరుగుతున్న దారుణాలను ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ సర్కారుపై మండిపడ్డారు.

” ఒక గిరిజన మహిళకు ఇంత అన్యాయం జరుగుతుంటే గిరిజన శాఖ మంత్రి ఎక్కడ? ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత నీచమైన చర్యలకు పాల్పడితే ఇక మహిళలకు రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? రౌడీల్లా, రేపిస్టుల్లా పోలీసులు దారుణంగా ప్రవర్తించారు.

ఈ అరాచకానికి పాల్పడిన ఎస్ఐ రవికుమార్, కానిస్టేబుల్ పై చర్యలు ఎందుకు తీసుకోలేదు? బాధిత మహిళ పై దాడి చేసిన వారిని కాకుండా ఎవరో ఇద్దరు కానిస్టేబుళ్లని ఎందుకు సస్పెండ్ చేశారు? అసలు ఒక మహిళను ఇంత దారుణంగా కొట్టే హక్కు మీకు ఎక్కడిది? గిరిజన మహిళ లక్ష్మికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మేం చేపట్టిన ధర్నాను అడ్డుకోవడం సిగ్గుమాలిన చర్య.

కేసీఆర్ కు పరిపాలన చేతకాలేదు కానీ మమ్మల్ని అరెస్ట్ చేయడం చేతనైంది. పోలీస్ డిపార్ట్మెంట్ , ప్రభుత్వం ఈ మహిళకు ఎలా న్యాయం చేస్తారో సమాధానం చెప్పాలి. తక్షణమే నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి, బాధిత మహిళకు రూ.25 లక్షల నష్టపరిహారం, 120 గజాల భూమి ఇస్తామని హామీ ఇస్తూ బహిరంగంగా ప్రభుత్వం తరఫున హామీ ఇవ్వాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ గిరిజన మహిళకు న్యాయం చేయకపోతే ప్రజలే కేసిఆర్ కు తగిన గుణపాఠం చెబుతారు అని షర్మిల ట్విట్టర్ లో పేర్కొన్నారు.

CM KCR: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏం జరిగిందో తెలుసా? వీళ్లు ఇప్పుడొచ్చి..: సీఎం కేసీఆర్