YSRCP MLA Roja : యాదాద్రి నిర్మాణం అద్భుతం.. ఎవరికీ దక్కని అవకాశం సీఎం కేసీఆర్‌‌కు దక్కింది

గుడి కట్టాలంటే భగవంతుడి ఆశీస్సులు ఉండాల్నారు. కాబట్టే సీఎం అందరి సహకారంతో, దేవుడి ఆశీస్సులతో ఆలయాన్ని నిర్మించారని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు...

YSRCP MLA Roja : యాదాద్రి నిర్మాణం అద్భుతం.. ఎవరికీ దక్కని అవకాశం సీఎం కేసీఆర్‌‌కు దక్కింది

Roja

Updated On : February 12, 2022 / 1:16 PM IST

YSRCP MLA Roja Visits Yadagirigutta Temple : యాదాద్రి ఆలయం నిర్మాణం అద్భుతం.. ఈ కాలంలో ఎవరికీ దక్కని అవకాశం సీఎం కేసీఆర్ కు దక్కిందన్నారు ఏపీ ఎమ్మెల్యే రోజా. 2022, ఫిబ్రవరి 12వ తేదీ శనివారం ఆమె యాదాద్రి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ…యాదాద్రి ఆలయాన్ని సీఎం కేసీఆర్ అద్బుతంగా నిర్మాణం చేస్తున్నారని కొనియాడారు. గతంతో పోలిస్తే చక్కగా ఇప్పుడు ఆలయాన్ని డిజైన్ చేసి పునః నిర్మాణం చేశారన్నారు. భగవంతుడే కేసీఆర్ ద్వారా తనకు కావాల్సిన ఆలయాన్ని నిర్మించుకున్నారని పేర్కొన్నారు.

Read More : Sarkaru Vaari Paata: రొమాంటిక్ వైబ్స్ క్రియేట్ చేస్తున్న కళావతి.. పక్కా డ్యూయెట్టేనా?

గుడి కట్టాలంటే భగవంతుడి ఆశీస్సులు ఉండాల్నారు. కాబట్టే సీఎం అందరి సహకారంతో, దేవుడి ఆశీస్సులతో ఆలయాన్ని నిర్మించారని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషించే విధంగా ఆలయాన్ని నిర్మించారని తెలిపారు. అయితే.. నిర్మాణంలో ఉపయోగించిన రాయి గుంటూరు జిల్లా నుంచి తీసుకొచ్చారన్నారు. ఇరు రాష్ట్రాల అన్నాదమ్ముళ్లు, అక్కా చెల్లెల్లుగా కలిసే ఉంటారని వ్యాఖ్యానించారు. తండ్రి సమానులైన సీఎం కేసీఆర్ సంతోషంగా ఉంటూ, ప్రజలను సంతోషంగా ఉంచేలా చూడాలని తాను స్వామి వారిని కోరుకున్నట్లు వెల్లడించారు ఎమ్మెల్యే రోజా.