ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల.. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

AP EAPCET Results 2024: ఫస్ట్ ర్యాంక్ మాకినేని జిష్ణు సాయి.. రెండవ ర్యాంకు మురసాని సాయి యశ్వంత్ రెడ్డి

ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల.. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 16 నుంచి 23 వరకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షలను దాదాపు 3.39 లక్షల మందికి విద్యార్థులు రాశారు. ఇందులో ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చారు. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఫలితాలను విడుదల చేసిన హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ జె.శ్యామలరావు మాట్లాడుతూ వివరాలు తెలిపారు. ఇంజనీరింగ్‌లో 1,95,092 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు చెప్పారు. ఇంజనీరింగ్‌లో 75.51 శాతం ఉత్తీర్ణత నమోదైందని తెలిపారు. అగ్రికల్చర్‌లో అర్హతసాధించిన వారు 70,352 మంది ఉండగా, ఉత్తీర్ణత శాతం 87.11గా నమోదైంది.

ఇంజనీరింగ్ ర్యాంకులు

  • ఫస్ట్ ర్యాంక్ మాకినేని జిష్ణు సాయి
  • రెండవ ర్యాంకు మురసాని సాయి యశ్వంత్ రెడ్డి
  • మూడో ర్యాంకు భోగలాపల్లి సందీష్

అగ్రికల్చర్‌లో..

  • ఫస్ట్ ర్యాంక్ యెల్లు శ్రీశాంత్ రెడ్డి(తెలంగాణ)
  • రెండవ ర్యాంక్ పూల దివ్యతేజ
  • మూడో ర్యాంక్ వడ్లపూడి ముకేశ్ చౌదరి

AP Summer Holidays : ఏపీలో వేసవి సెలవులు పొడిగింపు.. స్కూల్స్ రీఓపెన్ ఎప్పుడంటే?