ఘోర విమాన ప్రమాదం.. ఆ దేశ వైస్ ప్రెసిడెంట్‌తో పాటు మరో 9 మంది అక్కడికక్కడే మృతి

Plane Crash: ఆ విమానం అడవిలో కూలిపోయిందని, ఈ ఘటనలో అందులోని ఎవరూ ప్రాణాలతో మిగలలేదని..

ఘోర విమాన ప్రమాదం.. ఆ దేశ వైస్ ప్రెసిడెంట్‌తో పాటు మరో 9 మంది అక్కడికక్కడే మృతి

Malawi Vice President Saulos Chilima Dies In Plane Crash

విమాన ప్రమాదంలో మలావీ వైస్ ప్రెసిడెంట్ సౌలోస్ చిలిమా (51) ప్రాణాలు కోల్పోయారు. ఆగ్నేయ ఆఫ్రికాలోని దేశం మలావీ. విమాన ప్రమాదంపై ఆ దేశ అధ్యక్షుడు లాజరస్ చక్వేరా మంగళవారం ఓ ప్రకటన చేశారు. తమ దేశ వైస్ ప్రెసిడెంట్ సౌలోస్ చిలిమాతో పాటు మరో తొమ్మిది మంది విమాన ప్రమాదంలో మరణించారని తెలిపారు.

ఆ విమానం అడవిలో కూలిపోయిందని, ఈ ఘటనలో అందులోని ఎవరూ ప్రాణాలతో మిగలలేదని లాజరస్ చక్వేరా చెప్పారు. అడవిలో ఆ విమానం ఎక్కడ కూలిపోయిందన్న విషయాన్ని అధికారులు గుర్తించారని తెలిపారు. ఇది అత్యంత విషాదకర ఘటన అని లాజరస్ చక్వేరా మీడియాకు చెప్పారు.

కాగా, చిలిమా, మరో తొమ్మిది మందితో సోమవారం బయలుదేరిన సైనిక విమానం అదృశ్యమైంది. ప్రతికూల వాతావరణం వల్ల మ్జుజులో ల్యాండ్ చేద్దామనుకుని, పైలట్ ఆ ప్రయత్నాలు చేశారు. అయితే, ఆ ప్రయత్నాలు విఫలమై విమానం కుప్పకూలిందని అధికారులు గుర్తించారు. విమానం అదృశ్యమైనప్పుడు అందులోని వారి ఫోన్ల సిగ్నల్స్ అందించిన చివరి టవర్‌ను అధికారులు గుర్తించారు. దీంతో విమానం కుప్పకూలిన ప్రాంతం వద్దకు వెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Also Read: అంతా మోసం.. రూ.300 ఆభరణాన్ని యువతికి రూ.6 కోట్లకు అమ్మిన వ్యాపారి.. ఎలాగో తెలుసా?