రూ.300 కోట్ల అక్రమాలు జరిగాయి- బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో సోదాలపై ఈడీ కీలక ప్రకటన

అక్రమ మార్గంలో కూడబెట్టిన డబ్బుతో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టారని తెలిపింది.

రూ.300 కోట్ల అక్రమాలు జరిగాయి- బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో సోదాలపై ఈడీ కీలక ప్రకటన

ED Raids : మైనింగ్ పేరుతో పటాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రూ.300 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) స్పష్టం చేసింది. గత రెండు రోజులుగా సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో ఎమ్మెల్యే ఇళ్లు, ఆఫీసులపై.. మనీలాండరింగ్, హవాలా అనుమానాల నేపథ్యంలో ఈడీ సోదాలు జరిపింది. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇళ్లలో సోదాలకు సంబంధించి ఈడీ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. సంతోష్ శాండ్, సంతోష్ గ్రానైట్ కంపెనీల ద్వారా మొత్తం రూ.300 కోట్ల మైనింగ్ అక్రమాలు జరిగినట్లు గుర్తించామంది.

మైనింగ్ పేరుతో మహిపాల్ రెడ్డి.. ప్రభుత్వానికి 39 కోట్ల రూపాయల నష్టం చేకూర్చారని ఈడీ అధికారులు తెలిపారు. బ్యాంకు అకౌంట్లలో అక్రమ లావాదేవీలు గుర్తించామని ఈడీ పేర్కొంది. అక్రమ మార్గంలో కూడబెట్టిన డబ్బుతో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టారని తెలిపింది. సోదాల సందర్భంగా రూ.19లక్షలు స్వాధీనం చేసుకున్నామని తెలిపింది ఈడీ. బినామీల పేరుతో లావాదేవీలు గుర్తించిన ఈడీ.. కొన్ని బ్యాంకు లాకర్లను ఇంకా తెరవాల్సి ఉందంది. మధుసూదన్ రెడ్డి, మహిపాల్ రెడ్డిలకు పలువురు బినామీలుగా ఉన్నారని ఈడీ ప్రకటించింది.

Also Read : ఎమ్మెల్యే భార్య రూపాదేవి ఆత్మహత్యకు కారణమదే.. కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు