Ayodhya Ram Mandir: అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్టకు అత్యద్భుతమై శుభ ఘడియలు అవేనట..

అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు శుభముహూర్తం ఆసన్నమైంది. భక్తులు ఎప్పుడు ఎప్పుడాని ఎదురు చూస్తున్న ఆ శుభ తరుణం రానే వచ్చింది. వచ్చే ఏడాదే అయోధ్య రామయ్య ప్రతిష్టాపన ముహూర్తం జరుగనుంది.

Ayodhya Ram Mandir: అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్టకు అత్యద్భుతమై శుభ ఘడియలు అవేనట..

Ayodhya Ram Mandir : అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు శుభముహూర్తం ఆసన్నమైంది. భక్తులు ఎప్పుడు ఎప్పుడాని ఎదురు చూస్తున్న ఆ శుభ తరుణం రానే వచ్చింది. వచ్చే ఏడాదే అయోధ్య రామయ్య ప్రతిష్టాపన ముహూర్తం జరుగనుంది. 2024 జనవరి 22వ మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో అత్యంత శుభఘడియల్లో ముహూర్తం ఖరారు అయ్యింది. 84 సెకన్లపాటు ఉన్న ఈ శుభ గడియల్లో రామయ్యకు ప్రతిష్ఠ జరిగితే భారతేదేశానికే తలమానికంగా ఉంటుందని తెలిపారు. 22 మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల మధ్య అత్యంత శుభ గడియలున్నాయని పవిత్ర పుణ్యక్షేత్రమైన వారణాసికి చెందిన సంగ్వేద విద్యాలయ ఆచార్యుడు, జ్యోతిషుడు ఆచార్య గణేశ్వర్‌ శాస్త్రి ద్రవిడ్‌ తెలిపారు. మేష లగ్నంలో అభిజిత్‌ ముహూర్తంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగనుంది.

Ayodhya Ram Mandir : రాముడు అయోధ్య నుంచి లంకకు నడిచి వెళ్లినదారిలో పాదుకలతో పాదయాత్ర చేస్తున్న భక్తుడు..

అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులు హాజరుకానున్నారు. ఎంతోమందికి ఆహ్వానాలు అందాయి. దీంట్లో భాగంగా మహారాష్ట్రలోని పుణెకు చెందిన కేశవ్‌ శంఖనాద బృందానికి ఆహ్వానం అందింది. ఈ బృందానికి చెందిన 111 మంది అయోధ్యకు రానున్నారు. రామయ్య సన్నిధిలో శంఖనాదం చేయనున్నారు.

ఎన్నో ప్రాంతాల నుంచి రామయ్యకు అరుదైన, అద్భుతమైన భారీ కానుకలు అందుతున్నాయి. ముస్లిం సోదరులు కూడా మతసామరస్యాన్ని చాటుతు రామయ్య కోసం కానుకల్ని స్వయంగా తయారు చేసిన అందజేస్తున్నారు. అలా రాముడు ఏ కులానికో..ఏ మతానికి చెందినవాడు కాదనే భావన యావత్ భారత్ లో నిండిపోయింది. అటువంటి రామయ్యకు నేపాల్‌ నుంచి శ్రీరాముడికి కానుకలు అందనున్నాయి. శ్రీరామయ్యకు నగలు, పట్టు వస్త్రాలు, మిఠాయిలు వంటి గొప్ప గొప్ప బహుమానాలు రానున్నాయి. జనక్‌పుర్‌ధామ్‌- అయోధ్యధామ్‌ యాత్ర పేరుతో జనవరి 12న ఈ యాత్ర ప్రారంభమై 20న కానుకలను శ్రీరామ జన్మభూమి రామ మందిర ట్రస్టుకు అందించడంతో ముగుస్తుంది.