Top Headlines: ఉత్తరాఖండ్‌ టన్నెల్‌ రెస్క్యూలో ఆటంకాలు.. కాంగ్రెస్‌, బీజేపీ తెలంగాణకు అన్యాయం

సహాయక చర్యలు చేస్తుండగానే కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఇంకా కొంతమంది కార్మికులు సొరంగంలోనే ఉన్నారు. కాగా వారికి పైప్ లైన్ ద్వారా ఆహారాన్ని పంపిస్తున్నారు.

Top Headlines: ఉత్తరాఖండ్‌ టన్నెల్‌ రెస్క్యూలో ఆటంకాలు.. కాంగ్రెస్‌, బీజేపీ తెలంగాణకు అన్యాయం

Updated On : November 16, 2023 / 8:36 PM IST

కాలుష్య నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం ముమ్మర చర్యలు
దేశ రాజధాని ఢిల్లీలో పెరిగిన కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపట్టింది. ఇందు కోసం ఆరుగురు సభ్యులతో స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ ను ఏర్పాటు చేసింది.

కాంగ్రెస్‌, బీజేపీ తెలంగాణకు అన్యాయం
కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు తెలంగాణకు అన్యాయం చేశాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ రెండు పార్టీలపై విరుచుకుపడ్డారు. తెలంగాణలో అభివృద్ధి బీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని సీఎం కేసీఆర్‌ అన్నారు.

బీఆర్‌ఎస్‌ అంటే స్కీములు.. కాంగ్రెస్‌ అంటే స్కాములు
కాంగ్రెస్ పార్టీ అస్కాలు.. బీఆర్ఎస్ పార్టీ అంటే స్కీములు అని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ను ఓడించేందుకు అంతా ఒక్కటవుతున్నారని మండిపడ్డారు.

ప్రజల ఆకాంక్షలు నెరవరలేదు
బీఆర్ఎస్ పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ పేదల ప్రభుత్వం రావాలన్నా.. దొరల రాజ్యం కూలాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు.

ఉత్తరాఖండ్‌ టన్నెల్‌ రెస్క్యూలో ఆటంకాలు
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశిలో ఉన్న టన్నెల్ ప్రమాదం అనంతరం చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్‭కు ఆటంకాలు ఎదురువుతున్నాయి. సహాయక చర్యలు చేస్తుండగానే కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఇంకా కొంతమంది కార్మికులు సొరంగంలోనే ఉన్నారు. కాగా వారికి పైప్ లైన్ ద్వారా ఆహారాన్ని పంపిస్తున్నారు.

రేపు రాహుల్‌.. ఎల్లుండి అమిత్‌షా బహిరంగ సభలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జాతీయ నేతల పర్యటనలు మళ్లీ జోరందుకున్నాయి. రేపు (శుక్రవారం) రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించనుండగా.. ఎల్లుండి (శనివారం) కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇక్కడికి రానున్నారు. ఇక రాహుల్ గాంధీ సభలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఇప్పటికే 6 డిక్లరేషన్స్ ప్రకటించిన కాంగ్రెస్ పూర్తి స్థాయి మ్యానిఫెస్టో విడుదలకు సిద్ధం అయింది. జనాకర్షక హామీలతో మ్యానిఫెస్టో సిద్ధం చేసింది హస్తం పార్టీ.