Breaking News: ఢిల్లీలో పేలుళ్లు.. 8 మంది మృతి.. అనేక మందికి గాయాలు

పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి.

Breaking News: ఢిల్లీలో పేలుళ్లు.. 8 మంది మృతి.. అనేక మందికి గాయాలు

Delhi Red fort Blast

Updated On : November 10, 2025 / 8:00 PM IST

Delhi blasts: ఢిల్లీలో కలకలం చెలరేగింది. కారు పేలుళ్లు సంభవించాయి. ఎర్రకోట మెట్రోస్టేషన్‌ గేట్‌ నంబర్ 1 వద్ద ఈ పేలుళ్లు సంభవించాయి. దీంతో పలు వాహనాలకు మంటలు అంటుకున్నాయి. ఎనిమిది మంది మృతి చెందారు. చాలా మందికి గాయాలు అవ్వగా, వారిని ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రికి తరలించారు.

ఎర్రకోట వద్ద పార్క్ చేసి ఉన్న కారులో పేలుడు జరిగింది. ఉగ్రదాడి జరిగిందా? కారు ప్రమాదమా? అన్న విషయంపై తేలాల్సి ఉంది. పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. ఘటనాస్థలి వద్దకు ఏడు ఫైరింజన్లు చేరుకున్నాయి.

పేలుడు సంభవించిన కారు పక్కన ఉన్న పలు కార్లు, బైకులకు మంటలు అంటుకున్నాయి. ఫైరింజన్లతో సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు.

దేశంలో వారం రోజులుగా అధికారులు ఉగ్రకుట్రలను వరుసగా భగ్నం చేసిన విషయం తెలిసిందే. హరియాణాలో 2900 కిలోల ఐఈడీ బాంబు తయారీ మెటీరియల్‌తో పాటు ఉగ్ర దాడులకు వాడే ఇతర పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇందులో అరెస్ట్ అయిన వారిద్దరూ వైద్యులే.

అధికారులు వైట్‌కాలర్‌ నెట్‌వర్క్‌ను ఛేదించి, గత వారం రోజుల్లో రెండు వేర్వేరు ఘటనల్లో ఉగ్రచర్యలతో సంబంధం ఉన్న నలుగురు వైద్యులు, మరికొందరు వ్యక్తులను అధికారులు అరెస్ట్‌ చేశారు. ఈ సమయంలో ఢిల్లీలో పేలుళ్లు సంభవించడం గమనార్హం.