వైట్‌కాలర్ టెర్రర్: 4 రోజుల్లో నలుగురు వైద్యులు అరెస్ట్.. ఒకరు హైదరాబాదీ.. వాళ్లను పట్టుకోకపోతే ఏం జరిగేదంటే?
చైనాలో ఎంబీబీఎస్ చదివిన సయ్యద్.. రైసిన్ అనే ప్రాణాంతక ప్రోటీన్ తయారుచేస్తున్నాడు. ఢిల్లీ ఆజాద్‌పూర్ మండీ, అహ్మదాబాద్ నరోడా పండ్ల మార్కెట్, లక్నో ఆర్ఎస్సెస్ కార్యాలయాలపై కొన్ని నెలల పాటు గూఢచర్యం చేశాడు.
White collar network bust
White collar network bust: వైట్‌కాలర్ నెట్‌వర్క్‌ను అధికారులు ఛేదించారు. ఈ టెర్రర్ వ్యవస్థ గురించి సంచలన విషయాలను రాబట్టారు. గత వారం రోజుల్లో రెండు వేర్వేరు ఘటనల్లో ఉగ్రచర్యలతో సంబంధం ఉన్న నలుగురు వైద్యులు, మరికొందరు వ్యక్తులను అధికారులు అరెస్ట్ చేశారు.
తొలుతఉత్తరప్రదేశ్, హరియాణా, జమ్మూకశ్మీర్‌లో దాడులు జరిగాయి. ఇందులో బాంబులు తయారుచేయటానికి ఉపయోగించే 2,500కిలోలకుపైగా పదార్థాలు, రైఫిల్స్, పిస్టల్స్, ఇతర అనుమానాస్పద వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరొక అరెస్టు గుజరాత్‌లో జరిగింది. ఆ రాష్ట్రంలో దొరికిన వ్యక్తి ఓ హైదరాబాదీ.
అరెస్టైన ఈ నలుగురు వైద్యులు పాకిస్థాన్ తదితర దేశాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న విదేశీ హ్యాండ్లర్లతో టచ్‌లో ఉన్నారని తేలింది. ఐసిస్, జైషే మహ్మద్, అన్సార్ ఘజ్వతుల్ హింద్ వంటి నిషేధిత సంస్థలతో వారికి సంబంధం ఉందని వెల్లడైంది.
ఉన్నత విద్యావంతులు అయి ఉండి కూడా తమ స్థాయి, వృత్తిని ఉగ్రకార్యకలాపాల కోసం వినియోగిస్తున్నట్లు అధికారులు చెప్పారు. వీరు రసాయనాలు, తుపాకులతో దాడులు చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు.
ఉత్తరప్రదేశ్‌లో డాక్టర్ అదీల్ రదర్ అరెస్టు
జమ్మూకశ్మీర్ అనంతనాగ్ ప్రభుత్వ వైద్య కళాశాల (జీఎంసీ)లో సీనియర్ రెసిడెంట్‌గా పనిచేసిన డాక్టర్ అదీల్ అహ్మద్ రదర్ (27) వ్యక్తిగత లాకర్‌లో ఏకే47 రైఫిల్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కజిగుంద్‌కు చెందిన రదర్ 2024 అక్టోబర్ 24 వరకు జీఎంసీ అనంతనాగ్‌లో పని చేశాడు.
పోలీసులు అతనికి జైషే మహ్మద్, అన్సార్ ఘజ్వతుల్ హింద్ సంస్థలతో సంబంధం ఉన్నట్లు తెలిపారు. అక్టోబర్ 27న శ్రీనగర్‌లో జైషే మహ్మద్ మద్దతు పోస్టర్లు కనిపించిన తరువాత సీసీటీవీ ఫుటేజీను పరిశీలిస్తే రదర్‌పై అనుమానం కలిగింది. అనంతరం ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌లో అతన్ని గుర్తించి నవంబర్ 6న అరెస్ట్ చేశారు. ఆయుధ చట్టం, అనధికార కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద కేసు నమోదైంది.
Also Read: అమెరికాలో తెలుగు అమ్మాయి మృతి.. మృతదేహాన్ని ఇండియాకు తీసుకురావడానికి, లోన్లు తీర్చేందుకు ఇప్పుడు..
హరియాణాలో డాక్టర్ ముజమ్మిల్ షకీల్ అరెస్టు
అల్ ఫలాహ్ యూనివర్సిటీలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న కశ్మీరీ వైద్యుడు డాక్టర్ ముజమ్మిల్ షకీల్‌ను జమ్మూకశ్మీర్, హరియాణా పోలీసులు సంయుక్తంగా నవంబర్ 9న అరెస్ట్ చేశారు.
దర్యాప్తులో ఫరీదాబాద్‌లోని 12 సూట్‌కేసుల్లో 360కిలోల అనుమానాస్పద అమ్మోనియం నైట్రేట్ (బాంబుల్లో వినియోగించే రసాయనం) స్వాధీనం చేసుకున్నారు.
గుర్తు తెలియని వైద్యురాలు అరెస్టు
అదే ఫరీదాబాద్ ఆపరేషన్‌లో అల్ ఫలాహ్ యూనివర్సిటీకి చెందిన మహిళా వైద్యురాలు నవంబర్ 7న అరెస్ట్ అయ్యింది. ఆమె కారు నుంచి కేరోం కోక్ అసాల్ట్ రైఫిల్ స్వాధీనం చేసుకున్నారు. ఆమె పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. ఆమె గురించి ఇప్పటివరకు వివరాలను వెల్లడించలేదు.
హైదరాబాద్ డాక్టర్ అహ్మద్ సయ్యద్ అరెస్టు
హైదరాబాద్‌కు చెందిన 35 ఏళ్ల అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్‌ను గుజరాత్ ఏటీఎస్ నవంబర్ 7న అరెస్ట్ చేసింది. ఈ కేసు భద్రతా సంస్థల్లో కలకలం రేపింది. చైనాలో ఎంబీబీఎస్ చదివిన సయ్యద్.. రైసిన్ అనే ప్రాణాంతక ప్రోటీన్ (కాస్టర్ సీడ్స్ నుంచి తీసేది) తయారుచేస్తూ, ఢిల్లీ ఆజాద్‌పూర్ మండీ, అహ్మదాబాద్ నరోడా పండ్ల మార్కెట్, లక్నో ఆర్ఎస్సెస్ కార్యాలయాలపై నెలల పాటు గూఢచర్యం చేశాడు.
