Dog blood : బాబోయ్.. కుక్కల రక్తం ప్యాకెట్ రూ.25వేలు.. వీధి కుక్కల సంరక్షణ ముసుగులో దందా.. టార్గెట్ వారే..
Dog Blood : కొందరు వీధి కుక్కలను అపహరించి, డబ్బు కోసం వాటి రక్తాన్ని అమ్ముకుంటున్నారు. ఈ ఘటన హైదరాబాద్ లోని షేక్ పేట్ పరిధిలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెలుగు చూసింది.
Dog Blood Racket
- వీధి కుక్కల సంరక్షణ ముసుగులో మాఫియా
- ప్యాకెట్ రక్తం రూ. 25వేలు
- పెంపుడు కుక్కల యాజమానులే టార్గెట్
- హైదరాబాద్లో వెలుగులోకి వచ్చిన దారుణ ఘటన
Dog blood : కొందరు దుర్మార్గులు డబ్బుకోసం ఎంతటి దారుణాలకైనా తెగబడుతున్నారు. మనుషుల రక్తంతో కొందరు వ్యాపారం చేస్తుంటే.. మరికొందురు ఏకంగా కుక్కల రక్తంతో దందా సాగిస్తున్నారు. తాజాగా.. హైదరాబాద్ లో కుక్కల రక్తంతో దందా వెలుగు చూడటం తీవి్ర కలకలం సృష్టిస్తోంది. వీధి కుక్కల నుంచి సేకరించిన రక్తాన్ని అవసరం లేకపోయినా పెంపుడు కుక్కలకు ఎక్కిస్తున్న వైనం బట్టబయలైంది. కుక్కలను పెంచుకుంటున్న వారే లక్ష్యంగా సాగుతున్న ఈ దందాపై కొంతమంది జంతు ప్రేమికులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
Also Read : Chandrababu Naidu : తగ్గేదేలే.. మీసం మెలేస్తాం.. చంద్రబాబు నాయుడు అదిరిపోయే స్పీచ్.. లోకేశ్ పై ప్రశంసల జల్లు
కొందరు వీధి కుక్కలను అపహరించి, డబ్బు కోసం వాటి రక్తాన్ని అమ్ముకుంటున్నారు. ఈ ఘటన హైదరాబాద్ లోని షేక్ పేట్ పరిధిలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెలుగు చూసింది. ముందుగా వీధి కుక్కల చికిత్స, సంరక్షణ పేరుతో ఆస్పత్రి నిర్వాహకులు వాటిని ఆస్పత్రికి తీసుకొస్తారు. ఆ కుక్కలను బోన్లలో ఉంచి పెంచుతారు. ఈ క్రమంలో అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చే పెంపుడు కుక్కలే వారి టార్గెట్.
ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తీసుకొచ్చిన పెంపుడు కుక్కలకు అవసరం ఉన్నా.. లేకపోయినా రక్త పరీక్షలు నిర్వహిస్తారు. రక్తం సరిపడా ఉన్నా కూడా రక్తహీనత ఉన్నట్లు రిపోర్టులు వస్తాయి. వాటిని చూపించి కుక్కకు రక్తం ఎక్కిద్దామని వైద్యుడు యాజమానిని ఒప్పిస్తాడు. ఆ తరువాత బోనులో కుక్కలను చూపించి వాటి రక్తాన్ని ఎక్కిస్తామంటారు. అక్కడ ఒక్కో ప్యాకెట్ రక్తాన్ని రూ. 18వేల నుంచి రూ. 25వేల వరకు విక్రయిస్తున్నారు. ఒక్కోసారి వీధి కుక్కల రక్తం సరిపోక వైద్యం తీసుకుంటున్న పెంపుడు కుక్కల రక్తాన్నీ తీస్తుంటారని తెలుస్తోంది.
పెంపుడు జంతువులు అనారోగ్యానికి గురైతే ఎవరికీ చెప్పుకోలేవు. పెట్ పేరెంట్స్ వాటి ఆరోగ్యాన్ని తెలుసుకోవడం కష్టమే. అక్కడ వైద్యంతోపాటు అన్ని సేవలను అందిస్తారు. ప్రతి నెలా ఆరోగ్య పరీక్షలు చికిత్సలు, టీకాలు, అత్యవసర సేవలూ అందిస్తున్నారు. ఈ అవకాశాన్ని అదునుగా తీసుకొని రకరకాల పరీక్షలు చేస్తున్నారు. ఆ తరువాత పెట్ చాలా బలహీనంగా ఉందంటూ దానికి రక్తం ఎక్కించాలని చెప్పి అవసరం లేకపోయినా వేలాది రూపాయలు తీసుకొని పెంపుడు కుక్కలకు వీధి కుక్కల రక్తాన్ని ఎక్కిస్తున్నారు. ఈ క్రమంలో రక్తం తీయడంతో అప్పటి వరకు చలాకీగా ఉండే వీధి కుక్కలు రక్తహీనతతో మృత్యుభారిన పడుతున్నాయి. అయితే, ఆసుపత్రి సిబ్బంది అడ్డదారులు తొక్కడంపైఅనుమానం కలిగిన జంతు ప్రేమికులు విషయం అధికారుల దృష్టికి తీసుకురావడంతో ఈ తతంగం బయటపడింది.
