Parasakthi:పరాశక్తి మూవీలో తెలుగువారికి అవమానం.. ‘గోల్టీ’ పదం వాడటంపై అభ్యంతరం!

పరాశక్తి(Parasakthi) సినిమాలో తెలుగువాళ్లను అవమానించేలా డైలాగ్స్, తీవ్రంగా మండిపడుతున్న తెలుగు ప్రజలు.

Parasakthi:పరాశక్తి మూవీలో తెలుగువారికి అవమానం.. ‘గోల్టీ’ పదం వాడటంపై అభ్యంతరం!

'Golti' word in 'Parashakti' created controversy in Telugu states.

Updated On : January 12, 2026 / 10:51 AM IST
  • పరాశక్తి సినిమాలో తెలుగువారికి అవమానం
  • ‘గోల్టీ’ అనే పదం వాడటంపై అభ్యంతరం
  • బైకాట్ పరాశక్తి యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్న తెలుగు ఆడియన్స్

Parasakthi: ఆకాశమే నీ హద్దురా సినిమాతో తెలుగు ఆడియన్స్ కి చాలా దగ్గరయ్యారు లేడీ డైరెక్టర్ సుధా కొంగర. నిజానికి ఈమె తెలుగువారే. ఆమె ఆంద్రప్రదేశ్ లోని విజయవాడలో జన్మించారు. అందుకే, ఈమె సినిమాలకు తెలుగులో కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. తాజాగా ఆ దర్శకురాలు చేసిన సినిమా పరాశక్తి. శివకార్తికేయన్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో జయం రవి, అధర్వ మురళి, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా జనవరి 10న విడుదల అయ్యింది.

కానీ, ఆడియన్స్ నుంచి మాత్రం సినిమాకు ప్లాప్ టాక్ వచ్చింది. కథ, కథన పేలవంగా ఉండటంతో ఆడియన్స్ ఈ సినిమాపై నెగిటీవ్ రివ్యూస్ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా పరాశక్తి సినిమాపై కొత్త వివాదం నెలకొంది. ఈ సినిమాలో తెలుగువాళ్లను అవమానించేలా డైలాగ్స్ ఉన్నాయంటూ తెలుగు ఆడియన్స్ ఫైర్ అవుతున్నారు. నిజానికి పరాశక్తి(Parasakthi) సినిమా 1960లలో తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక నిరసనల నేపథ్యంతో జరుగుతుంది.

Deepika Pilli: బీచ్ లో దీపికా పిల్లి.. పొట్టి డ్రస్సులో యాంకరమ్మ అందం అదరహో.. ఫొటోలు

దాంతో, హిందువులపై ‘గోల్టీ’ అనే పదాన్ని వాడారు. గోల్టీ అంటే దొంగ, మురికివాడు అని అర్థం. దాంతో, తెలుగువాళ్లపై ఇలాంటి పదాలు ఎలా వాడతారు అంటూ ఇక్కడ ఆడియన్స్ మండిపడుతున్నారు. నిజానికి, ఈ పదాన్ని మ్యూట్ చేయాలనీ సెన్సార్ బోర్డు మేకర్స్ కి ముందే సూచించింది. కానీ, అది పట్టించుకోకుండా సినిమాను రిలీజ్ చేశారు. అలాగే, ఈ సినిమాలో 20కి పైగా సీన్స్ పై సెన్సార్ అభ్యంతరం వ్యక్తం చేసింది.

కానీ, వాటిని తొలగించడం వల్ల సినిమా ఫ్లో పోతుంది అని సుధా కొంగర సూచించారట. మరి, ‘గోల్టీ’ అనే పదాన్ని ఎలా ఉంచారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంలో తెలుగు వారైనా సుధా కొంగరను కూడా ఇక్కడ ఆడియన్స్ తప్పుబడుతున్నారు. అసలు పరాశక్తి సినిమాను బైకాట్ చేయాలంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. మరి ఈ వివాదంపై దర్శకురాలు సుధా కొంగర ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.