Met Gala 2023: ప్రపంచ ప్రసిద్ధ తారల కోసం వేసిన రెడ్ కార్పెట్‌పై నడుచుకుంటూ వెళ్లిన బొద్దింక

Met Gala 2023: న్యూయార్క్ లోని మెట్రోపొలిటియన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ లో బొద్దింక కూడా క్యాట్ వాక్ చేసి ఫ్యాషన్ రంగంలోకి ప్రవేశించిందంటూ సామాజిక మాధ్యమాల్లో జోకులు పేలుతున్నాయి.

Met Gala 2023: ప్రపంచ ప్రసిద్ధ తారల కోసం వేసిన రెడ్ కార్పెట్‌పై నడుచుకుంటూ వెళ్లిన బొద్దింక

A cockroach has arrived at the #MetGala

Updated On : May 2, 2023 / 6:12 PM IST

Met Gala 2023: మెట్ గాలా (Met Gala 2023) జరుగుతోంది. ఈ వేడుకకు అతిరథ మహారథులు వస్తారు. “ఫ్యాషన్” లోకం అంతా హడావుడిగా ఉంది. సరికొత్త దుస్తులు ధరించి హొయలొలికిస్తూ రెడ్ కార్పెట్ పై నడుస్తూ తళుక్కుమనేందుకు ప్రపంచ ప్రసిద్ధ తారలు సిద్ధమయ్యారు. ఎవరికీ ఏ అసౌకర్యమూ కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి, నిర్వాహకులు ఎంతో జాగ్రత్తతో ఉన్నారు.

ఇంతలో అక్కడి రెడ్ కార్పెట్‌పై ఓ బొద్దింక (Cockroach)కనపడింది. అతిరథ మహారథులు నడిచే ఆ రెడ్ కార్పెట్ పై ఆ బొద్దింక నడుచుకుంటూ వెళ్లింది. ఈ పరిణామంలో అక్కడి వారంతా షాక్ అయ్యారు. ప్రపంచ ప్రసిద్ధ తారల ఫొటోలు, వీడియోలను తీసేందుకు అక్కడకు వచ్చిన ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్లు అందరూ ఆ బొద్దింక వీడియోలు, ఫొటోలను తీశారు.

ఆ బొద్దింక వీడియో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. మెట్ గాలా (Met Gala 2023)లో తారలపైనే అందరి దృష్టీ ఉంటుంది. అయితే, ఈ సారి ఆ అనుకోని అతిథి బొద్దింకపై కూడా ప్రపంచ ప్రేక్షకులు దృష్టి పెట్టాల్సి వచ్చింది.

న్యూయార్క్ లోని మెట్రోపొలిటియన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ లో బొద్దింక కూడా క్యాట్ వాక్ చేసి ఫ్యాషన్ రంగంలోకి ప్రవేశించిందంటూ సామాజిక మాధ్యమాల్లో జోకులు పేలుతున్నాయి. కాగా, ఇదే వేడుకలో భారత్ నుంచి హీరోయిన్ అలియా భట్ పాల్గొంది. ఆమె ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి. అలియాతో పాటు ప్రియాంకా చోప్రా, ఇషా అంబానీ కూడా ఇందులో పాల్గొన్నారు.


Top 10 Selling Cars 2023 : ఏప్రిల్ 2023లో అత్యధికంగా అమ్ముడైన 10 కార్లు ఇవే.. ఫుల్ లిస్టు ఇదిగో..!