Revathi Thangavelu : 93 ఏళ్ల వృద్ధురాలికి ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్‌డీ .. ఇండియాలో ఏ యూనివర్సిటీకి లేని రికార్డు
చదువుకి వయసుతో సంబంధం ఉండదు అంటారు. చదువుపై మక్కువ .. చదువుకోవాలనే పట్టుదల ఉంటే వయసు అడ్డంకి కాదని నిరూపించారు రేవతి తంగవేలు. 93 ఏళ్ల వయసులో ఇంగ్లీష్‌లో పీహెచ్‌డి పట్టా సాధించారు.

Revathi Thangavelu
Revathi Thangavelu : ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన 83వ స్నాతకోత్సవంలో 93 ఏళ్ల వృద్ధురాలు ఇంగ్లీష్‌లో పీహెచ్‌డి పట్టా అందుకున్నారు. ఆంగ్ల వ్యాకరణం, వర్ణమాల, పదాల నిర్మాణంలో ఆమెను పీహెచ్‌డి పట్టా వరించింది.
Anand Mahindra : శీతల్ దేవి ప్రతిభకు ముగ్దుడైన ఆనంద్ మహీంద్రా.. బంపర్ ఆఫర్.. వీడియో షేర్
చదువుకి వయసుతో సంబంధం ఉండదు అంటారు. నిజమని నిరూపించారు 93 ఏళ్ల రేవతి తంగవేలు. రీసెంట్‌గా ఆమె ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇంగ్లీష్‌లో పీహెచ్‌డి పట్టా పొందారు. ఆంగ్ల వ్యాకరణం, వర్ణమాల, పదాల నిర్మాణం వంటి అంశాలపై రేవతి తంగవేలు పరిశోధన చేశారు. ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్ చేతుల మీదుగా ఆమె పీహెచ్‌డి అందుకున్నారు.
PM Narendra Modi : ప్రధాని మోడీ షేర్ చేసిన శాల్మలీ వీడియో.. చిన్నారి ప్రతిభకు ప్రధాని ఫిదా..
రేవతి తంగవేలు 1990 లో లెక్చరర్‌గా పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని కీస్ ఎడ్యుకేషనల్ సొసైటీలో పనిచేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ 83 వ స్నాతకోత్సవంలో డిగ్రీలు పొందిన 1,024 మంది పీహెచ్‌డి గ్రాడ్యుయేట్లలో రేవతి తంగవేలు ఒకరు. ఇది ఒక సంవత్సరంలో భారతదేశంలో ఏ యూనివర్సిటీ సాధించని రికార్డు. ఈ కార్యక్రమంలో చదువుల్లో ప్రతిభ కనబరిచిన 58 మంది విద్యార్ధులకు బంగారు పతకాలతో సత్కారం జరిగింది.