Sam Altman : అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓపెన్‌ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మాన్.. మ్యారేజ్ ఎలా జరిగిందో తెలుసా?

ఒకరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో నిష్ణాతులు.. మరొకరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. ఇద్దరూ అబ్బాయిలే.. వీరిద్దరూ పెళ్లాడటం ఇప్పుడు వార్తల్లో నిలిచింది.

Sam Altman : అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓపెన్‌ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మాన్.. మ్యారేజ్ ఎలా జరిగిందో తెలుసా?

Sam Altman

Updated On : January 12, 2024 / 2:36 PM IST

Sam Altman : OpenAI CEO సామ్ ఆల్ట్‌మాన్ దీర్ఘకాల ప్రియుడు ఆలివర్ ముల్హెరిన్‌తో పెళ్లి పీటలు ఎక్కాడు. ఆశ్చర్యపోతున్నారా? నిజమే.. అతికొద్దిమంది సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది.

విచిత్రమైన పెళ్లిళ్ల గురించి వినే ఉంటారు. చెట్టుకి పెళ్లి చేయడం.. కప్పలకు పెళ్లి చేయడం.. ఈ మధ్య కాలంలో అమ్మాయిలు అమ్మాయిలు పెళ్లిళ్లు చేసుకోవడం.. అబ్బాయిలు కూడా అబ్బాయిలనే పెళ్లాడటం వింటున్నాం. ఈ కల్చర్ ఎక్కువ అవుతోంది అని కూడా చెప్పవచ్చు.  అయితే  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో నిష్ణాతులైన అబ్బాయి.. మరో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పెళ్లి చేసుకోవడం ఆసక్తికరంగా మారింది.

Delhi : 2018 నుండి విదేశాల్లో మరణించిన భారతీయ విద్యార్ధుల సంఖ్య 403

సామ్ ఆల్ట్‌మాన్ గత సంవత్సరం చాట్ జిపిటిని ప్రారంభించి ఎంతో పేరు సంపాదించారు.. ఇది AI పరిశోధన, అభివృద్ధి చేయడంలో ఎంతో ఉపకరించింది. ఈ రంగంలో బిలియన్ల పెట్టుబడులు కారణమైంది. సామ్ ఆల్ట్‌మాన్ ఆయన చిరకాల స్నేహితుడు ఆలివర్ ముల్హెరిన్‌కి సంబంధించిన వార్త వైరల్ అవుతోంది. వీరిద్దరూ వివాహబంధంతో ఒక్కటయ్యారంటూ సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సామ్ ఆల్ట్‌మాన్ ఈ విషయాన్ని ధృవీకరించినట్లు తెలుస్తోంది.

సోషల్ మీడియాలో కనిపించిన ఫోటోల్లో వీరి వివాహానికి కొద్దిమంది స్నేహితులు మాత్రమే హాజరైనట్లు అర్ధమవుతోంది. ఆల్ట్‌మాన్ మరియు ముల్హెరిన్ ఉంగరాలు మార్చుకుని వివాహ ప్రమాణాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆలివర్ ముల్హెరిన్ ఆస్ట్రేలియన్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. త్వరలో వీరిద్దరూ పిల్లలను కూడా పెంచుకోవాలని భావిస్తున్నారట. ఈ విషయాన్ని ఆల్ట్ మాన్ న్యూయార్క్ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Thaina Fields : ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి మాట్లాడిన కొన్ని నెలలకే చనిపోయిన నటి

సామ్ ఆల్ట్‌మాన్ గత సంవత్సరం AI స్టార్టప్ OpenAI సీఈఓ పదవి నుండి తొలగించబడ్డారు. ChatGPt స్టార్‌తో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఐదు రోజుల్లో తిరిగి నియమించబడ్డారు. మొత్తానికి ఈ జంట పెళ్లి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు వీరి వివాహ ఫోటోలు చూసి ఆశ్చర్యపోయారు. ఇవి నిజమేనా లేదంటే AI మాయ అంటూ ప్రశ్నించారు.