Delhi : 2018 నుండి విదేశాల్లో మరణించిన భారతీయ విద్యార్ధుల సంఖ్య 403

2018 నుంచి ఇప్పటివరకు విదేశాలకు వెళ్లిన భారతీయ విద్యార్ధులు అధిక సంఖ్యలో మరణించడం ఆందోళనకరంగా ఉంది. అయితే వారి భద్రతపై చర్యలు తీసుకుంటామని కేంద్రం వెల్లడించింది.

Delhi : 2018 నుండి విదేశాల్లో మరణించిన భారతీయ విద్యార్ధుల సంఖ్య 403

Delhi

Delhi : 2018 నుండి ఇప్పటివరకు విదేశాల్లో మరణించిన భారతీయ విద్యార్ధుల సంఖ్య 403 గా కేంద్రం వెల్లడించింది. అయితే అత్యధిక మరణాలు కెనడాలో సంభవించడం ఆందోళన కలిగిస్తోంది.

Putin Praises Modi: మోదీని చూసి ఆశ్చర్యపోతా.. మరోసారి ప్రశంసలు కురిపించిన పుతిన్

విదేశాల్లో మరణించిన భారతీయ విద్యార్ధుల డేటాను కేంద్ర మంత్రి వి మురళీధరన్ రాజ్యసభలో సమర్పించారు. డేటా ప్రకారం 2018 నుండి ఇప్పటివరకు 403 మంది విద్యార్ధులు మరణించినట్లు తెలుస్తోంది. అయితే అనారోగ్యం, ప్రమాదాలు ఇతర కారణాల వల్ల ఈ మరణాలు సంభవించాయి.

Varanasi : వారణాసి ఆశ్రమంలో నలుగురు ఆంధ్రా కుటుంబ సభ్యుల ఆత్మహత్య

మంత్రిత్వ శాఖ సమర్పించిన డేటా ప్రకారం కెనడాలో 2018 నుండి 91 మంది భారతీయ విద్యార్ధులు మరణించారు. యునైటెడ్ కింగ్ డమ్ 48, రష్యా 40, యునైటెడ్ స్టేట్స్ 36, ఆస్ట్రేలియా 35, ఉక్రెయిన్ 21, జర్మనీ 20, సైప్రస్ 14, ఇటలీ మరియు ఫిలిప్పీన్స్ ఒక్కొక్కటిలో 10 మంది చనిపోయారు. కాగా విదేశాల్లో ఉన్న భారతీయ విద్యార్ధుల భద్రత కోసం కేంద్రం కృషి చేస్తుందని కేంద్ర మంత్రి మురళీధరన్ వెల్లడించారు. అది ప్రభుత్వ బాధ్యతగా చెప్పారాయన. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే విచారణ జరిపి, నేరస్థులకు శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.