MAA Elections counting: ఈసీ మెంబర్స్.. లీడ్‌లో ప్రకాష్ రాజ్ టీమ్..?

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల కౌంటింగ్.. ఉత్కంఠభరితంగా కంటిన్యూ అవుతోంది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెళ్ల మధ్య.. టఫ్ ఫైట్ కొనసాగుతోంది.

MAA Elections counting: ఈసీ మెంబర్స్.. లీడ్‌లో ప్రకాష్ రాజ్ టీమ్..?

Prakash Raj

Updated On : October 10, 2021 / 7:04 PM IST

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల కౌంటింగ్.. ఉత్కంఠభరితంగా కంటిన్యూ అవుతోంది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెళ్ల మధ్య.. టఫ్ ఫైట్ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులో మంచు విష్ణు ముందంజలో నిలిచారని వార్తలు వస్తే.. ఈసీ మెంబర్ల ఓట్ల లెక్కింపులో ప్రకాష్ రాజ్ టీమ్ ఆధిక్యంలో నిలిచినట్టు తెలుస్తోంది. 18 మంది లీడ్ లో ఉన్నారని సమాచారం.

మంచు విష్ణు ప్యానెల్ నుంచి… ఈసీ మెంబర్లుగా అర్చన, అశోక్ కుమార్, గీతా సింగ్, హరినాథ్ బాబు, జయవాణి, మలక్ పేట శైలజ, మాణిక్, పూజిత, రాజేశ్వరి రెడ్డి, రేఖ, సంపూర్ణేష్ బాబు, శశాంక్, శివనారాయణ, శ్రీలక్ష్మి, శ్రీనివాసులుల, స్వప్నమాధురి, విష్ణు బొప్పన, వడ్లపట్ల ఎంఆర్‌సీ.. పోటీలో ఉన్నారు.

ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి.. ఈసీ మెంబర్లుగా టార్జాన్, తనీష్, అనసూయ, సుడిగాలి సుధీర్, భూపాల్, బ్రహ్మాజీ, గోవిందరావ్, శ్రీధర్ రావ్, సుబ్బరాజు, ప్రభాకర్, రోహిత్, కౌషిక్, ఖయ్యూమ్, కొండేటి సురేష్, రమణారెడ్డి, ప్రగతి, సమీర్, శివారెడ్డి బరిలో నిలిచారు.

Also Read:

MAA Elections: మా.. ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్..?

MAA Elections: కౌంటింగ్‌లో రచ్చ.. ఎన్నికల అధికారితో ప్రకాష్ రాజ్ గొడవ