IBPS Jobs 2025: బ్యాంకు PO, SO ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఇవి ఫాలో అవ్వండి.. జాబ్ గ్యారంటీ
IBPS Jobs 2025: IBPS అంటే ఇన్స్టిట్యుట్ అఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్. ప్రతి సంవత్సరం ప్రభుత్వ బ్యాంకుల్లో PO (ప్రొబేషనరీ ఆఫీసర్), SO (స్పెషలిస్ట్ ఆఫీసర్) పోస్టుల కోసం పరీక్షలు నిర్వహిస్తుంది

IBPO Exams 2025 preparation planning
IBPS అంటే ఇన్స్టిట్యుట్ అఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్. ప్రతి సంవత్సరం ప్రభుత్వ బ్యాంకుల్లో PO (ప్రొబేషనరీ ఆఫీసర్), SO (స్పెషలిస్ట్ ఆఫీసర్) పోస్టుల కోసం పరీక్షలు నిర్వహిస్తుంది. ఇవి దేశవ్యాప్తంగా జరిగే పోటీ పరీక్ష. అధిక సీట్లు, స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగం కావడంతో అభ్యర్థులు కూడా పెద్ద సంఖ్యలో ఈ జాబ్స్ కోసం పోటీ పడతారు. చాలా మంది అప్లై చేస్తారు కానీ, ఈ ఎగ్జామ్స్ కోసం ఏం ప్రిపేర్ అవ్వాలో ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియదు. అందుకే ఇక్కడ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కి సంబందించిన పూర్తి వివరాలను వివరిస్తున్నాం. మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది.
IBPS PO & SO సిలబస్ విభాగాల వారీగా:
రీజనింగ్ ఎబిలిటీ(Reasoning Ability):
సీటింగ్ అరేంజ్మెంట్(Circular, Linear)
- పజిల్స్
- సిలాగ్స్మ్
- బ్లడ్ రిలేషన్
- కోడింగ్-డీకోడింగ్
- ఇన్ ఈక్వాలిటీస్
- ఇన్పుట్-అవుట్ ఫుట్
- లాజికల్ రీజనింగ్
- డైరెక్షన్ సెన్స్
- డేటా సఫీషియన్సీ
క్వాంటిటేటీవ్ ఆప్టిట్యూడ్ (Quantitative Aptitude):
నంబర్ సిరీస్ (Number Series)
- Simplification / Approximation
- Data Interpretation (Bar Graph, Pie Chart, Table)
- Quadratic Equations
- Arithmetic Topics – Profit & Loss, Time & Work, SI & CI, Ratio, Averages, Mixtures & Allegations, etc.
- Data Sufficiency
ఇంగ్లీష్ లాంగ్వేజ్ (English Language):
రీడింగ్ కాంప్రెహెన్షన్ (Reading Comprehension)
- Cloze Test
- Para Jumbles
- Spotting Errors
- Sentence Improvement
- Fill in the Blanks
- Vocabulary (Synonyms, Antonyms, Idioms & Phrases)
జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవెర్నెస్(General/Economy/Banking Awareness):
భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ
- RBI విధానాలు
- కరెంట్ అఫైర్స్ (6 నెలల వరకూ)
- దేశీ & అంతర్జాతీయ ఆర్థిక వార్తలు
- Budget, Economic Survey
- Static GK – Capitals, Currency, Important Days
- Latest Banking Terms & Abbreviations
కంప్యూటర్ ఆప్టిట్యూడ్(Mainly for PO Mains):
- MS Office
- Basics of Computers
- Operating Systems
- Networking
- Internet Usage
- Cyber Security
ప్రిపరేషన్ స్ట్రాటజీ (Daily Plan):
- రోజులో 2 గంటలు Reasoning
- 2 గంటలు Quantitative
- 1 గంట English
- 1 గంట GK + కరెంట్ అఫైర్స్
- 30 నిమిషాలు మాక్ టెస్టు పరిష్కరించడం
తప్పకుండ ఫాలో అవ్వాల్సిన బుక్స్:
- రీజనింగ్ కోసం RS Aggarwal / Arihant Publications
- క్వాంటిటేటివ్ కోసం Fast Track Arithmetic / Quantum CAT – Sarvesh Verma
- ఇంగ్లీష్ కోసం Wren & Martin / Plinth to Paramount
- GK అండ్ బ్యాంకింగ్ అవెర్నెస్ కోసం Lucent GK, Banking Chronicle Monthly Magazines
- మాక్ టెస్ట్స్ కిశోరం Oliveboard, Testbook, Gradeup, PracticeMock
IBPS PO మరియు SO అనేవి బ్యాంకింగ్ రంగంలో మంచి స్థిరత, గౌరవాన్ని కలిగించే ఉద్యోగాలు. సరైన సిలబస్ అవగాహనతో పాటు, ప్లాన్డ్ స్టడీ, రివిజన్, టెస్ట్ ప్రాక్టీస్ లాంటివి చేస్తే మీరు తప్పకుండా ఈ పరీక్షలలో విజయం సాధించగలుగుతారు.